/rtv/media/media_files/2025/02/20/N16shtVEaXz3vunpnIIi.jpg)
Vishwak Sen tweet Photograph: (Vishwak Sen tweet)
Vishwak Sen Tweet: టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల లైలా(Laila) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎక్కువగా అసభ్యకర పదాలు ఉండటంతో కాస్త నెగిటివిటీ వచ్చింది. సినిమాపై బ్యాడ్ టాక్ రావడంతో పాటు కనీస కలెక్షన్ల కూడా రాలేదు. అయితే ఈ క్రమంలో విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా ఓ సంచలన ప్రకటన చేశాడు. అందరికీ నమస్కారం.. అందరూ కోరుకున్న స్థాయికి ఇటీవల తన సినిమా చేరుకోలేకపోయిందని.. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నానన్నారు.
ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!
విమర్శించే హక్కు మీకు ఉందని..
తనని నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి హృదయపూర్వక క్షమాపణలని తెలిపారు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నానన్నారు. ఇకపై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా కూడా అసభ్యత ఉండదని తెలిపారు. నేను ఏదైనా చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉందన్నారు. ఎందుకంటే, తన ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో ప్రేమతో తనని ముందుకు నడిపించింది ప్రేక్షకులే. కెరీర్ ప్రారంభం నుంచి తాను ఎంచుకున్న కథలను ప్రేక్షకులు ఎంతగానో ప్రేమించారన్నారు.
ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..
ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. కథానాయకులు దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, తనని మలిచిన ప్రతి ఒక్కరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలని, త్వరలో మరొక బలమైన కథతో ముందుకు వస్తానన్నారు. ప్రేక్షకుల మద్దతు తనకు ఎంతో ముఖ్యమని విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?