ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన విశ్వక్ సేన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి హిట్‌లు కొడుతూనే ఉన్నాడు. అయితే విశ్వక్ సేన్ తాజాగా లైలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను మూవీ టీం విడుదల చేసింది. టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది.
ఇది కూడా చూడండి: Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష
Welcome to the world of #Laila filled with fun, action and romance ❤🔥
— VishwakSen (@VishwakSenActor) January 17, 2025
The Echipaad #LailaTeaser out now 💥💥
▶️ https://t.co/YHl8j4IgAK
GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th @RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/OQ5I4yzaJN
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?
తోలు తీసుడు కూడా..
రొటీన్ స్టోరీలతో కాకుండా కొత్తగా స్టోరీలా లైలా సినిమా అనిపిస్తోంది. ఇందులో కొన్ని డైలాగ్‌లు కూడా మాస్‌గా ఉన్నాయి. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ కాస్త కామెడీగా ఉంది. కొన్ని డైలాగ్‌లు మాస్‌గా అనిపించినా కూడా కాస్త నవ్వులను పంచుతున్నాయి. తెల్లగా సేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చుని, అలాగే ఒక్కొక్కరికి చిలకలు కోసి చీరలు కట్టి పంపిస్తా వంటి డైలాగ్‌లు సూపర్ ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?
ఇక టీజర్ చివరిలో విశ్వక్ సేన్ గుర్తుపట్టలేని ఓ పాత్రలో కనిపించాడు. అమ్మాయి గెటప్‌లో ఉన్న విశ్వక్ సేన్‌ను అమ్మాయిలు కూడా ఈర్ష్య పడేంత అందంలో కనిపించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కానుంది. ఈ టీజర్ చూస్తుంటే విశ్వక్ ఖాతాలో మరో హిట్ పడినట్లే.
ఇది కూడా చూడండి: Rinku Singh: పెళ్లికి సిద్ధమైన క్రికెటర్.. యంగ్ ఎంపీతో త్వరలో వివాహం