AP News: పాపిష్టి సవతి తల్లి... పసిగుడ్డును గోడకేసి కొట్టి చంపి..

గుంటూరులోని ఫిరంగిపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సవతి తల్లి లక్ష్మి ఆరేళ్ళ కుమారుడిని గోడకేసి కొట్టి చంపింది. సాగర్ అనే వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలు అనే కోపంతో లక్ష్మీ వారిని తరచూ హింసిస్తూ ఉండేది.

New Update
Guntur incident

Guntur incident

 AP News: పసిగుడ్డు అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టింది సవతితల్లి. మొదటి భార్య పిల్లలు అనే కోపంతో చిత్రహింసలకు గురిచేసింది. అతి కర్కశంగా ఆరేళ్ళ కుమారుడిని గోడకేసి కొట్టి చంపింది. ఈ అమానవీయ ఘటన గుంటూరులోని ఫిరంగిపురం గ్రామంలో చోటుచేసుకుంది. 

ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

గోడకేసి కొట్టి 

 సాగర్ అనే వ్యక్తికి గతంలో పెళ్ళై.. ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. అయితే మొదటి భార్య చనిపోవడంతో సాగర్ ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నాడు. లక్ష్మీ సాగర్ కి భార్య అయ్యింది.. కానీ అతడి పిల్లలకు మాత్రం తల్లి కాలేకపోయింది. మొదటి భార్య పిల్లలు అనే కోపంతో ఆ ఇద్దరినీ తరచూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ క్రమంలో ఆదివారం చిన్న కుమారుడు కార్తీక్ ని(6) దారుణంగా హింసిస్తూ గోడకేసి కొట్టింది. దీంతో ఆ బాలుడి తల పగిలి చనిపోయాడు. అంతేకాదు పెద్దకుమారుడు ఆకాష్ కి రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. కార్తీక మరణంతో సవతితల్లి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.

latest-news | crime | guntur

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు