Good Bad Ugly: అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' HD ప్రింట్ లీక్!

అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ విడుదలైన 24 గంటల్లోనే HD ప్రింట్ లీకైంది. టెలీగ్రామ్, తమిళ రాకర్స్, గ్రూప్స్ లో మూవీకి సంబంధించిన లింక్ విస్తృతంగా షేర్ అవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో అజిత్ అభిమానులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update

Good Bad Ugly:  తమిళ హీరో అజిత మోస్ట్ అవైటెడ్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' యాక్షన్ ఎంటర్ టైనర్ ఏప్రిల్ 10న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాతో మైత్రి మేకర్స్ తమిళ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది. 

Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

పైరసీ కాపీ.. 

కానీ ఊహించని విధంగా విడుదలైన కొన్ని గంటల్లోనే ఈమూవీ హెచ్ డీ ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయ్యింది. టెలిగ్రామ్, ఐబొమ్మ, తమిళ్ రాకర్స్ వంటి సైట్లలో మూవీ పైరసీ కాపీ విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. దీంతో చిత్రబృందంతో సహా అభిమానులను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఈ ఘటన సినిమా ఇండస్ట్రీలో మరోసారి పైరసీ సమస్య హైలైట్ చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో విధంగా పెద్ద హీరోల సినిమాలను పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తే.. విడుదలైన గంటలోనే ఆన్ లైన్లో లీక్ అవడం చిత్రనిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది. పైరసీ మొత్తం చిత్ర పరిశ్రమను ప్రభావితం చేస్తుంది.  నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, లైసెన్స్ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు తీవ్రంగా నష్టపోతాయి. అలాగే నటీనటులు కష్టం వృధా అవుతుంది.   చట్టబద్ధంగా సినిమాలు చూడటం ద్వారా కళాకారులు, దర్శకనిర్మాతలకు  సరైన ఫలితం లభిస్తుందని అందరి అభిప్రాయం. 

ఈ చిత్రంలో అజిత్ కుమార్ జోడీగా  త్రిష కృష్ణన్, ఉషా ఉతుప్, రాహుల్ దేవ్, యోగి బాబు, జాకీ ష్రాఫ్, సునీల్, అర్జున్ దాస్,  తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment