/rtv/media/media_files/2025/03/23/gGHUAKWAUOrownl8yh5g.jpg)
ganesh acharya
కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య బాలీవుడ్ తో టాలీవుడ్ లోనూ అనేక సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేశారు. రీసెంట్ గా విడుదలైన 'పుష్ప2' ఆయన కొరియోగ్రఫీ చేసిన జాతర సీక్వెన్స్, సూసేకి, కిస్సిక్ పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గణేష్ ఆచార్య బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: TG Crime: హైదరాబాద్‌లో దారుణ హత్య.. వేటాడి వెంటాడి గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు
Hardwork deserves appreciation
— Allu Babloo AADHF (@allubabloo) March 21, 2025
Ganesh acharya says : i never got an appreciation from Bollywood stars, being a biggest star AlluArjun sir called me & appreciated my work 🔥🙏
Always welcomes & appreciate talents AA@alluarjun #Pushpa2TheRulepic.twitter.com/a4vxqjALOA
అహం ఎక్కువ..
బాలీవుడ్‌లో తనకు గుర్తింపు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. "బాలీవుడ్‌లో చాలా అహం ఉందని.. అలా ఉండకూడదని అన్నారు. అదే సమయంలో తెలుగు పరిశ్రమ పై ప్రశంసలు కురిపించారు. హీరో అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో తన పనిని గుర్తించడాన్ని ప్రశంసించారు. ''నీ వల్లే ప్రజలు నన్ను అభినందిస్తున్నారు'' అంటూ అల్లు అర్జున్ తనకు క్రెడిట్ ఇవ్వడాన్ని గుర్తుచేసుకున్నారు. తనతో ఎవరైనా అలా చెప్పడం అదే మొదటి సారి అని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే బన్నీ తనను సక్సెస్ పార్టీకి పిలిచి.. అభినందించినట్లు తెలిపారు. బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్ పరిశ్రమ సాంకేతిక నిపుణులకు ఎక్కువ గౌరవం ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ నటులు ఎప్పుడూ.. అలా పిలిచి, ఫోన్ చేసి తన పనిని గుర్తించలేదని తెలిపారు. గణేష్ ఆచార్య బీటౌన్ పై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
latest-news | bollywood | allu-arjun | ganesh-acharya
Also Read: Court Premalo Song: "కథలెన్నో చెప్పారు.. కవితల్నీ రాశారు.." ప్రేమలో ఫుల్ వీడియో సాంగ్ చూశారా..?