రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల రాజమండ్రిలో జరిగిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ కి మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఈవెంట్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. సుమారు 1000 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. Also Read : 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో ఇద్దరు మృతి.. అండగా నిలిచిన పవన్, దిల్ రాజు అయినా కూడా ఇదే ఈవెంట్ లో కొందరు ఆకతాయిలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈవెంట్ అనంతరం గ్రౌండ్ లో జనాలు చూడ్డానికి పెట్టిన LED స్క్రీన్ ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వాళ్ళను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలుస్తోంది. కాగా LED స్క్రీన్ ను ధ్వంసం చేస్తుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నిన్న రాజమండ్రిలో జరిగిన #GameChanger ఈవెంట్ అనంతరం కొందరు ఆకతాయిలు ఇలా పబ్లిక్ వీక్షణ కోసం పెట్టిన LED Screen ను ధ్వంసం చేశారు.పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారని సమాచారం. pic.twitter.com/Hdy1hITeC3 — Rajesh Manne (@rajeshmanne1) January 5, 2025 మెగా ఫ్యాన్స్ మృతి.. మరోవైపు ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు రామ్ చరణ్ హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్ స్పందించారు. వారి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ 10 లక్షలు, దిల్ రాజు 10 లక్షలు, రామ్ చరణ్ 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. Also Read : మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్..అసలేమైందంటే!