Game Changer: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్- తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గేమ్ ఛేంజర్ . దాదాపు 2 ఏళ్ళ తర్వాత చరణ్ సోలోగా రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రిలీజ్ కి ముందే రామ్ చరణ్ 256 ఫీట్ల కటౌట్ ఏర్పాటు సంబరాలు మొదలు పెట్టారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రేక్షకులలో సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. Also Read: Allu Arjun: అల్లు అర్జున్ జోలికి వస్తే చంపేస్తాం! OU జేఏసీ సంచలన ఆరోపణలు చరణ్ కోసం రేవంత్, పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టుగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నిర్మాత దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ ని కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించారు. ఈవెంట్ జనవరి 4న రాజమండ్రిలోని ఓపెన్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఓవర్ సీస్ ప్రమోషన్స్ లో భాగంగా .. అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్ Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై