game changer scam
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఊహించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా విడుదలై వారం రోజులు కూడా కాకముందే సోషల్ మీడియాలో పైరసీ కాపీలు విస్తృతంగా సర్క్యులేట్ అవడం హాట్ టాపిక్ గా మారింది.
నిందితులను అరెస్టు..
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీని ఏపీలోని ఓ లోకల్ ఛానెల్ ప్రసారం చేయగా..దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిత్రబృందం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిపిన గాజువాక పోలీసులు.. తాజాగా పైరసీ కాపీని ప్రసారం చేసిన ఆరుగురు ఛానెల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. సైబర్ క్లూస్ టీమ్ టీవీ ఛానల్‌పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ నిందితుల అరెస్ట్ గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ చేసి కాకినాడలో ఏపీ లోకల్ టీవీ ఛానల్ లో ప్లే చేసిన అప్పల రాజుని అరెస్ట్ చేసిన గాజువాక పోలీసులు.#ramcharan #GameChanager #AndhraPradesh #RTV pic.twitter.com/FAEhtzbams
— RTV (@RTVnewsnetwork) January 17, 2025
45 మందిపై ఫిర్యాదు
ఇది ఇలా ఉంటే ఇప్పటికే.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే 'గేమ్ ఛేంజర్' మొత్తం లీక్ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్రబృందం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రిలీజ్ కి రెండు రోజుల ముందే సినిమాలోని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో షేర్ చేశారని, రిలీజ్ అవ్వగానే సినిమా అంతా ఆన్లైన్ లో లీక్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు దీనికి సంబంధించి ఆధారాలు సేకరించిన చిత్రబృందం 45 మందితో కూడిన ముఠాపై ఫిర్యాదు చేసింది.
Also Read: Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!