Gaddar Awards : ఉగాది నుంచి 'గద్దర్' అవార్డులు.. ఆ సినిమాలకు మాత్రమే

ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాజాగా జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

New Update
gaddar film awards

gaddar film awards

ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం  నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆవార్డులు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Also Read :  జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. MAAకు మాధవీలత ఫిర్యాదు

సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత పది సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని  పరిపాలించిన వారు చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారు, అవార్డుల పంపిణీ జరగలేదని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవన్నట్టు తెలిపారు. ఫీచర్ ఫిల్మ్‌లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. 

Also Read :  సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్

కాగా ఈ సమావేశంలో టీఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు, ఎండీ డాక్టర్‌ హరీశ్‌, ఈడీ కిషోర్‌బాబు, కమిటీ చైర్మన్‌ బీ నర్సింగ్‌రావు, కమిటీ సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ్‌, హరీశ్‌ శంకర్‌, వందేమాతరం శ్రీనివాస్‌, గుమ్మడి వెన్నెల, అల్లాణి శ్రీధర్‌, వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lakshmi Rai: బికినీ అందాలతో రెచ్చిపోయిన హీరోయిన్!

నటి లక్ష్మి రాయ్ బికినీ అందాలతో రెచ్చిపోయింది. తాజాగా బికినీలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను మీరు చూశారా?

New Update
Advertisment
Advertisment
Advertisment