/rtv/media/media_files/2025/02/10/BzisMuJKK1dAofBZW4D2.jpg)
Ed Sheeran
Ed Sheeran: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. సెలెబ్రెటీలు సైతం పలు ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియా రీల్స్ ఈ పాటను పాడారు. ఇప్పుడు బ్రిటీష్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎడ్ షీరన్ నోట కూడా ఎన్టీఆర్ 'చుట్టమల్లే' సాంగ్ వినిపించడం నెట్టింట వైరల్ గా మారింది.
Also Read: వైఎస్ జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!
'చుట్టమల్లే' సాంగ్ పాడిన బ్రిటీష్ సింగర్
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సింగర్ ఎడ్ షిరీన్.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లో తన మ్యూజికల్ ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆ తర్వాత మేఘలయా రాష్ట్రంలోని షిల్లాంగ్, ఢిల్లీ, గురుగ్రామ్‌లో కూడా ఆయన కాన్సర్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన కాన్సర్ట్ లో భారతీయ గాయని శిల్పా రావుతో కలిసి ఎడ్ షిరీన్ 'చుట్టమల్లే' సాంగ్ పాడడం ఎన్టీఆర్ అభిమానులను ఆనందపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటను శిల్పా రావు తన అద్భుతమైన గాత్రంతో ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.
Erasing the boundaries with global reach @tarak9999 @anirudhofficial ❤️
— Vamsi Kaka (@vamsikaka) February 9, 2025
Ed Sheeran & Shilpa Rao performing the sensational #Chuttamalle song from #Devara pic.twitter.com/Hs12zW8YPo
ఎడ్ షిరీన్ .. "Shape of You", "Perfect", "Castle on the Hill", "Shivers" వంటి చార్ట్ బస్టర్లు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. వీటితో పాటు మరెన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ తో సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్నారు. అతని పాటలు వివిధ భాషల్లో అనువాదం కూడా అయ్యాయి.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ఎవరి అభిమానో తెలుసా.. సక్సెస్ మీట్లో బన్నీ సంచలన స్టేట్మెంట్!