కోలీవుడ్ యంగ్ బ్యూటీతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్?

కోలీవుడ్‌ యంగ్ బ్యూటీ బ్రిగిడాతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పెదకాపు సినిమా సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఈకారణంగానే తన భార్యతో కూడా విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. చెన్నైలో బ్రిగిడా, శ్రీకాంత్ కలిసి ఉంటున్నారట.

New Update
Srikantha Addala relation With Brigida

Srikantha Addala relation With Brigida Photograph: (Srikantha Addala relation With Brigida)

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో వరుసగా బిగ్గెస్ట్ హిట్‌లు అందుకుని.. బ్రహ్మోత్సవంతో ఫ్లాప్ అయ్యాడు. చివరగా పెదకాపు మూవీ కూడా పెద్దగా హిట్ కాలేదు. అయితే శ్రీకాంత్ అడ్డాల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?

ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?

ఆ సినిమా సమయంలోనే స్నేహం..

శ్రీకాంత్ అడ్డాల కోలీవుడ్‌ యంగ్ బ్యూటీ బ్రిగిడాతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తెలుగులో సింధూరం, పెదకాపు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే పెదకాపు సినిమా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వచ్చింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని, అప్పటి నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?

చెన్నైలో వీరిద్దరూ కలిసి ఉంటున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. బ్రిగిడాతో రిలేషన్‌లో ఉండటం వల్లే శ్రీకాంత్‌కి తన భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయని, గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇన్నేళ్ల వయస్సు గ్యాప్ ఉన్న డైరెక్టర్‌తో రిలేషన్ ఏంటని అంటున్నారు. దీనిపై ఇంకా ఇద్దరూ కూడా స్పందించలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

మెగా ఫ్యాన్స్ కు రేపు నిజంగానే పండుగ రోజు. అసలే రేపు శ్రీరామ నవమి...దానికి తోడు చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ ను ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ గ్లింప్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

New Update
peddi ram charan look

peddi ram charan look

గేమ్ ఛేంజర్ తర్వాత అందరూ ఆసక్తి చూస్తున్న రామ్ చరణ్ సినిమా పెద్ది. ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై హైప్స్ పెంచేసిన మూవీ దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తానంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ దీని కోసం ఆతృతగా ఎదురు చేస్తున్నారు. 

పెద్ది గ్లింప్స్ పై క్రేజీ పోస్ట్ లు..

టైటిల్ ఎంత క్రేజీగా ఉందో ఇందులో చరణ్ లుక్ కూడా అంతే క్రేజీగా చాలా మాస్ అండ్ రస్టిక్ ఉంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో చరణ్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. 'ఉప్పెన' తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ కథను సిద్ధం చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పుడు గ్లింప్స్ శ్రీరామ నవమి రోజు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పెద్ది' మూవీ గ్లింప్స్ ని ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. రేపు (ఏప్రిల్ 6) ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దీనిపై తాజాగా రామ్ చరణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  గ్లింప్స్ చూసిన తర్వాత సూపర్ ఉత్సాహంగా ఉంది. ఇది మీకు కూడా చాలా నచ్చుతుంది అంటూ అందులో రాశారు. ఈ సందర్భంగా ఓ వీడియోని కూడా షేర్ చేసారు. దీనిపై బుచ్చిబాబు రియాక్ట్ అవుతూ ఏఆర్ రెహమాన్, చరణ్ అదరగొట్టారనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు.

 

 today-latest-news-in-telugu 

 Also Read: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment