/rtv/media/media_files/2024/12/21/Z4cB2qldjwTGc5jIfLHi.jpg)
Director RGV at Ongole Rural Police Station
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి నేడు రామ్ గోపాల్ వర్మ్ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో ఆర్జీవీ విచారణకు వెళ్లారు. అయితే ఈ కేసులో కోర్టు ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ముందుగానే ఆదేశించింది. దీంతో ఇవాళ పోలీసు విచారణకు ఆర్జీవీ హాజరయ్యారు. ఈ విచారణలో ఆర్జీవిని పలు ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రశ్నలతో ఆర్జీవీ షాక్ అయినట్లు సమాచారం. మరి ఆయన బయటకొచ్చాక ఏ ఏ విషయాలపై పోలీసులు విచారణ చేశారో తెలియనుంది.