/rtv/media/media_files/2025/03/18/3VVDOO2bI8GvHrMwoK6w.jpg)
Director Nag Ashwin interesting comments on Prabhas Kalki 2 movie
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి’ బాక్సాఫీసును షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.2000 కోట్ల కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది. ఇక ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే కల్కి 2 మూవీ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెకండ్ పార్ట్ పై దర్శకుడు కిక్కిచ్చే ట్రీట్ అందించాడు.
కల్కి 2 మూవీ స్క్రిప్ట్ వర్క్, స్టోరీ, షూటింగ్ వంటి ఇతర విషయాల గురించి ఒళ్లు గగుర్లుపుడిచే వ్యాఖ్యలు చేశాడు. అతడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ‘కల్కి 2’ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి
Kalki 2 Update
We are tentatively fixed for this year end to release #Kalki2. But it will change. The prep work is going on
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) March 18, 2025
We've setup everything in #Kalki2898AD 1st part. The entire 2nd part will be about #Bhairava & #Karna story.
-#NagAshwin
pic.twitter.com/2EnZQBFIu6
కల్కి 2 మూవీకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అన్నాడు. అయితే అసలు ప్రాజెక్ట్ కె అంటే ఏంటి అనే దగ్గరే ఇంకా ఉన్నామని.. అది పూర్తయిన తర్వాతే షూటింగ్ మొదలు పెడతామని తెలిపాడు. ఈ ఏడాది ఆఖరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నాడు. కాగా కల్కి మూవీని మహాభారతం నేపథ్యం ఆధారంగా సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేసుకుని ఇక్కడి వరకూ వచ్చామన్నారు.
Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
అదే సమయంలో పార్ట్ 1లో ప్రభాస్ నిడివి తక్కువగా ఉండటంపై కూడా మాట్లాడాడు. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కచ్చితంగా ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. ముఖ్యంగా భైరవ, కర్ణ యాంగిల్‌లోనే స్టోరీ సాగుతుందని.. సెకండ్ పార్ట్‌లో వీటికే అధిక ప్రాధాన్యం ఉంటుందని అన్నాడు. అయితే దీని కోసం చాలా వర్క్ చేయాల్సి ఉందని.. అందువల్ల ఈ మూవీ విడుదల తేదీపై ఇప్పుడేమి చెప్పలేనని పేర్కొన్నాడు. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రభాస్ అభిమానులు అశ్విన్ వ్యాఖ్యలకు సంబరపడిపోతున్నారు.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..