ARI Movie: పేపర్ బాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన జయశంకర్.. ఆ తర్వాత 'అరి' సినిమా తెరకెక్కించారు. ఇంతవరకు ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలపై కాన్సెప్ట్ తో ఈ స్టోరీని రూపొందించాడు. అయితే దాదాపు రెండేళ్ల కిందట షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. గతేడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్రమోషన్స్ కూడా చేశారు. టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రచార చిత్రాలన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి సైతం ఈ సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. అదే సమయంలో సినిమా విడుదల చేసి ఉంటే.. సినిమాకు వచ్చిన బజ్ బాగా ఉపయోగపడేది. కారణం ఏంటో తెలియదు కానీ.. అప్పుడు రిలీజ్ కాకుండానే ఆగిపోయింది.
Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!
మళ్ళీ ఏడాది తర్వాత
కాగా, మళ్ళీ ఏడాది తర్వాత తాజాగా ఈమూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఆదివారం 'కల్కి' ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో మూవీ థీమ్ సాంగ్ రిలీజ్ చేయించారు. ' 'భగ భగ..' అంటూ సాగే ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు మేకర్స్. మంచి రెస్పాన్స్, డిఫరెంట్ కంటెంట్ ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియడం లేదు. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి అగ్ర తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ సినిమాస్ & శ్రీ సినిమా స్టూడియోస్ బ్యానర్ పై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పూరిమెట్ల పి.హెచ్.డి సంయుక్తంగా నిర్మించారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
telugu-news | cinema-news | latest-news ari-movie
Also Read: This Week Ott Movies: ఈవారం ఓటీటీ, థియేటర్స్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. సినిమాల లిస్ట్ ఇదే?