నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్' జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతో దూసుకుపోతోంది. తాజాగా అమెరికాలోని డల్లాస్‌లో 'డాకు మహారాజ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బాలకృష్ణతో పాటు చిత్రబృందం పాల్గొని సందడి చేశారు. ఇదే ఈవెంట్ లో దర్శకుడు బాబీ ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. Also Read : టికెట్ రేట్లు పెంచుతుంది అందుకే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ 'డాకు మహారాజ్' కథ రాసే సమయంలో మరో ప్రత్యేకమైన పాత్ర కోసం దుల్కర్ సల్మాన్‌ను అనుకున్నామం. అయితే, స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరుస్తున్న క్రమంలో ఆ పాత్ర అవసరం లేదని నిర్ణయించుకున్నాం. అందువల్ల, దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో భాగం కాకపోయారని బాబీ వెల్లడించారు. దీంతో దుల్కర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారని, అది వాళ్లకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే డల్లాస్ లో కి ఇటీవల 'గేమ్ ఛేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. థమన్ సంగీతం అందించారు. Also Read : కింగ్ ఆఫ్ జంగిల్.. 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది