/rtv/media/media_files/2025/03/06/dneFnXZALn75VVWtydnh.jpg)
Rowdy Janardhana
Rowdy Janardhana: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. గేమ్ ఛేంజర్ తో లాస్ లో పడిపోయిన దిల్ రాజు కు 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ ఊరటనిచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రీరిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజ్.. SLVC బ్యానర్ లో రాబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్ లీక్ చేశారు.
'రౌడీ జనార్దన్'
అయితే దిల్ రాజు నిర్మాతగా విజయ్ హీరోగా #SVC59 పేరుతో ఇప్పటికే ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, తాజా ప్రెస్ మీట్ లో పొరపాటున ఈసినిమా టైటిల్ ని లీక్ చేశారు దిల్ రాజ్. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్దన్' చేస్తున్నాము అని అన్నారు. దీంతో సినిమాకు 'రౌడీ జనార్దన్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఇక తాజాగా నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని
అధికారికంగా ప్రకటించింది. 'అతడి పేరు తెలుసుకున్నారు. త్వరలోనే అతడిని చూస్తారు' అనే క్యాప్షన్ తో ట్వీట్ చేశారు.
#RowdyJanardhana 💣
— Sri Venkateswara Creations (@SVC_official) March 5, 2025
We lit a SPARK by accident! Now the streets are on fire. 🔥
You know his name, soon you’ll know THE MAN.@TheDeverakonda @storytellerkola @SVC_official #SVC59
విజయ్ దేవరకొండ హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్ డమ్' చేస్తున్నారు. ఇప్పటికే మూవీ టీజర్ విడుదల చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. లైగర్ డిజాస్టర్ తర్వాత రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది మే 30న 'కింగ్ డమ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.