Devara: ఎన్టీయార్ ఇచ్చి పడేశాడు..దేవర బ్లాక్ బస్టర్ హిట్

తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో  ఎన్టీయార్ దేవర సినిమా మొదటి షో పడిపోయింది. ఎన్టీయార్ కోసం సినిమా చూడాలని...మూవీ అధ్భుతంగా ఉందని చెబుతున్నారు. క్లైమాక్స్లో ట్విస్ట్‌తో కొరటాల శివ ఇచ్చి పడేశాడు అని అంటున్నారు. 

New Update

Devara Movie Review: 

తెలుగు రాష్ట్రాలు దేవర సినిమా పిచ్చితో ఊగిపోతున్నాయి. ఆరు ఏళ్ళగా వెయిట్ చేస్తున్న ఎన్టీయర్ ఫ్యాన్స్‌కు అయితే పండగే అని అంటున్నారు. మొత్తం సినిమా అంతా తారక్‌ దేనని అంటున్నారు. కథ, అనిరుధ్ బీజీఎం అన్నీ అదిరిపోయాయి అని అంటున్నారు. ఫస్ట్ హాప్‌ కొంత డల్‌గా ఉన్నట్టు అనిపించినా...ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ మాత్రం చించేశాడని ప్రేక్షకులు చెబుతున్నారు. అసలు అలాంటి క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించరని అంటున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అని అరిచి మరీ గోల చేస్తున్నారు. రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు ఫ్లాప్ వస్తుందని అంటారు...కానీ అది ఎన్టీయార్ విషయంలో మాత్రం కాదు అని చెబుతున్నారు ఫ్యాన్స్. తారక్ ఓ లెవల్‌ల యాక్ట్ చేశాడని...ఇంక దేని కోసం వెళ్ళినా...వెళ్ళకపోయినా అతని కోసం సినిమా చూడొచ్చని అంటున్నారు. నెగెటివ్ రివ్యూలను వినోద్దని...సినిమా చూసి వచ్చి మాట్లాడాలని అంటున్నారు. కల్కి సినిమాలో అయితే ఎలా అంతా పరిచయం చేసి..సెకెండ్ హాఫ్ కోసం ఎదురు చూడండి అని చెప్పారో...దేవరలో కూడా అంతే. సినిమాలో మొదటి హాఫ్ అంతా దేవర ప్రపంచాన్ని పరిచయం చేశారు. సెకండ్ హాఫ్‌లో పీక్స్‌కు తీసుకెళ్ళారు అని చెబుతున్నారు. దేవర పార్ట్‌–2లో అసలు సినిమా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కొందరు చెప్పారు. అయితే కొంతమంది మాత్రం సినిమా బాలేదని..3,500 రూ.లు పెట్టి టికెట్ కొనుక్కుని వస్తే నిరాశే ఎదురయిందని చెప్పారు. మరొకరు సినిమాలో నిద్రపోయానని కూడా అన్నారు.

 

మరోవైపు ఓవర్సీస్‌లో కూడా మొదటి షో పడిపోయింది. అక్కడ ప్రస్తుతానికి మిక్స్‌డ్‌ టాక్ నడుస్తోంది. కేవలం ఎన్టీయార్‌‌ ఒక్కడే సినిమాను లాగేశాడని...మిగతాదంతా సోసో గా ఉందని రివ్యూలు వస్తున్నాయి.  ఓవర్సీస్‌లో దేవర మూవీకి 3/5  రేటింగ్ ఇస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court on Netflix: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

నాని సమర్పించిన 'కోర్ట్' మార్చి 14న విడుదలై రూ.50 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. శివాజీ మంగపాతిగా అలరించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ పై నెట్‌ఫ్లిక్స్ శివాజీ తో ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.

New Update
Court on Netflix

Court on Netflix

Court on Netflix: నేచురల్ స్టార్ నాని(Nani) సమర్పణలో వచ్చిన 'కోర్ట్: స్టేట్ vs ఏ నోబాడీ' సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదలై, భారీ విజయాన్ని అందుకుంది. మాస్ ప్లస్ క్లాస్ కంటెంట్‌కి కంబినేషన్‌గా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

ఈ సినిమాలో మాజీ హీరో శివాజీ పోషించిన మంగపాతి పాత్ర, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శివాజీ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

మంగపతి మీ ఇంటికొచ్చేస్తాడు..!

తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ మొదలైంది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో మంగపతి గెటప్‌లో కనిపించిన శివాజీ, తన స్టైల్లో మాట్లాడుతూ, “సినిమాలు చూసే జనాలని నేను మార్చలేకపోవచ్చు... కానీ వాళ్లే చూసే కంటెంట్‌ని మాత్రం మార్చగలనండి. కోర్ట్‌ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చూడండి. ఇకపై మంగపతి మీ ఇంటికొచ్చేస్తాడు,” అంటూ ఆసక్తి పెంచారు.

Also Read: మహేష్ బాబుతో శవాల ముందు డ్యాన్స్ వేయిస్తా..!

ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పాల, రోహిణి, సాయికుమార్, ప్రియదర్శి, హర్షవర్ధన్ లాంటి నటులు ముఖ్యపాత్రల్లో నటించారు. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సంగీతాన్ని విజయ్ బుల్గానిన్ అందించారు.

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

ప్రేక్షకులను ఆలోచనలో పడేసే కథతో వచ్చిన ఈ కోర్ట్ డ్రామా ఇప్పుడు ఓటిటీలో మరింత క్రేజ్‌ను సంపాదించనుంది.

Advertisment
Advertisment
Advertisment