Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

నితిన్ హీరోగా వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈ వెంట్ ఈరోజు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరయ్యాడు. అందులో చిత్ర బృందంతో కలిసి అతను డాన్స్ తో అదరగొట్టాడు. 

author-image
By Manogna alamuru
New Update
David warner first look

David warner first look

టాలీవుడ్ యంగ్ హీరో లవర్ బాయ్ నితిన్ (Nithin) హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం 'రాబిన్ హుడ్' (Robinhood). 'భీష్మ' లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో 'రాబిన్ హుడ్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 28న రాబిన్ హుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సినిమాలో అతిథి పాత్ర..

ఈ సినిమాలో  ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇందులో అతిథి పాత్ర పోషించాడు. మరికొన్ని రోజుల్లో రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అవనుండడంతో ఈ రోజు ప్రీ రిలీజ్ ఈ వెంట్ నిర్వహించారు. దీనికి వార్నర్ కూడా హాజరయ్యాడు. హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో టీమ్‌తో కలిసి ఆయన డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

 

 today-latest-news-in-telugu | ketika sharma item song in robin hood movie | David Warner

Advertisment
Advertisment
Advertisment