Balayya: ఊర్వశి బ్యాక్ చితక్కొట్టిన బాలయ్య..'దబిడి దిబిడి' సాంగ్ పై ట్రోలింగ్

'డాకు మహారాజ్'మూవీ నుంచి రిలీజైన 'దబిడి దిబిడి' సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ముఖ్యంగా పాటలోని స్టెప్పులపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాటలో ఊర్వశి బ్యాక్ పై బాలయ్య చేతులతో గుద్దే స్టెప్పులపై నెట్టింట రచ్చ నడుస్తోంది.

New Update
dabidi dibidi song

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. తాజాగా ఈ సినిమా నుంచి "దబిడి దిబిడి" అనే పాటను విడుదల చేశారు మేకర్స్. థమన్ కంపోజ్ చేసిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ముఖ్యంగా పాటలోని స్టెప్పులపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే?

ఈ పాటను కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. పాటలో ఊర్వశి బ్యాక్ పై బాలయ్య చేతులతో గుద్దే స్టెప్పులపై నెట్టింట రచ్చ నడుస్తోంది. "ఇవేం స్టెప్పులురా నాయనా? బాలయ్యతో ఇలాంటి స్టెప్పులు వేయించడం ఏంటయ్యా?" అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

దర్శకుడు బాబీ కూడా మళ్లీ సాధారణ మాస్ మసాలా సాంగ్‌కు వెళ్తారా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఈ పాటలో వేసిన స్టెప్పులు, ఊర్వశీ రౌటేలా చూపించిన విధానం చాలా మందికి నచ్చలేదు. ఫ్యాన్స్ అయితే ఈ పాట పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "మాకే ఈ పాట నచ్చలేదంటే, మిగతా ప్రేక్షకులకు ఎలా నచ్చుతుందిలే?" అని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

తమన్ మ్యూజిక్ కూడా  బాలేదు. ఇంతకు ముందు మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, భాగ్యశ్రీల డాన్స్ సీన్లు ట్రోలింగ్‌కు గురైన నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య, ఊర్వశీ రౌటేలా మధ్య వయస్సు గ్యాప్ గురించి, అలాగే పాటలో చూపించిన స్టెప్పులపై కూడా అదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 'డాకు మహారాజ్' ఓ వైవిధ్యమైన ప్రయోగం అని అనుకున్నారంతా. కానీ ఈ పాట విడుదల తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. 

Also Read : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా?

ఇది రెగ్యులర్ తెలుగు మాస్ మసాలా సినిమానే అని 'దబిడి దిబిడి' పాటతోనే అర్థమవుతోంది. మరోవైపు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ మధ్య కంపోజిషన్ లో వెనకబడ్డాడు. ఈ మధ్య ఆయన కంపోజిషన్ లో కొత్తదనం లేకపోవడం.. ఆయనకు పోటీగా విజయ్ పోలాకి, మోయిన్, జిత్తూ.. ఇలా పలువురు యంగ్ కొరియోగ్రాఫర్స్ ఫామ్ లోకి రావడంతో ఇక ఆయన పనైపోయిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు