థియేటర్స్ లో 'దేవర' న్యూ వెర్షన్.. 'దావూదీ' సాంగ్ తో కొత్త సీన్స్ కూడా

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు 'దేవర' టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాలో తొలగొంచిన 'దావుదీ' సాంగ్ ను థియేట్రిక‌ల్ వెర్ష‌న్‌లో ఈ రోజు నుంచి జ‌త చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.సెకండాఫ్ లో ఈ పాట వస్తుందని, పాటకు ముందు ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఓ సీన్ కూడా యాడ్ చేసినట్లు సమాచారం.

New Update

జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో నటించిన 'దేవర' ఇటీవల థియేటర్స్ లో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా.. అన్ని చోట్ల సినిమాకి భారీ ఆదరణ దక్కింది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ.396 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

సుమారు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో మూవీ కావడంతో అభిమానులతో పాటూ సినీ లవర్స్ సైతం థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి 'దావూదీ' అనే సాంగ్‌ను చిత్ర‌యూనిట్ తొల‌గించిన విష‌యం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా ఈ పాటకు సంబంధించిన సుమారు 2 నిమిషాల వీడియో వెర్షన్ ను వదిలితే.. అందులో తారక్, జాన్వీ డ్యాన్స్ కు అందరూ ఫిదా అయ్యారు. 

'దావుదీ' ఇక నుంచి థియేటర్స్ లో..

దాంతో థియేటర్లు లో ఈ సాంగ్ దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఈ సాంగ్ కు సరైన ప్లేస్ మెంట్ దొరకకపోవడంతో మూవీ టీమ్ థియేట్రికల్ వెర్షన్ లో యాడ్ చేయలేదు. దీంతో ఈ పాట‌ను థియేట‌ర్లో చూద్దాం అనుకున్న ప్రేక్ష‌కుల‌కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ.. ఈ పాట‌ను థియేట్రిక‌ల్ వెర్ష‌న్‌లో ఈ రోజు నుంచి జ‌త చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

సెకండాఫ్ లో ఈ పాట వస్తుందని, పాటకు ముందు ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఓ సీన్ కూడా యాడ్ చేసినట్లు సమాచారం. ఆ సీన్ తర్వాతే.. 'దావూదీ' సాంగ్ వస్తుందట. ఇక ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సాంగ్ కోసమైనా సినిమాను మరోసారి థియేటర్స్ లో చూడాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

Also Read : మతిపోగొట్టే ఆఫర్.. కేవలం రూ.2,099కే 5జీ ఫోన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరింతగా ఉంది. యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ ఇలా ప్రతి విషయంలోనూ కట్ చేసిన ట్రైలర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

New Update
Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram | Vijayashanti

Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram

నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన కొత్త సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. సయీ మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు.

ట్రైలర్ అదుర్స్

ఇవాళ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. టైటిల్‌కు తగ్గట్లుగా తల్లీకొడుకుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యమున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. 

(Arjun Son Of Vyjayanthi)

Advertisment
Advertisment
Advertisment