Chuttamalle: NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చుట్టమల్లె సాంగ్ వచ్చేసింది

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన చిత్రం ‘దేవర’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా నవంబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దేవర సినిమా నుంచి చుట్టమల్లే అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది.

New Update
devara,,

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. ఫస్ట్ నుంచి పోస్టర్లు, టీజర్, సాంగ్, ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసిన దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం!

ఫస్ట్ షో నుంచి మంచి రెస్పాన్స్‌తో నందమూరి అభిమానులను, సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంతేకాకుండా బాక్సాపీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా 16 రోజుల్లో రూ.500 కోట్లు కొల్లగొట్టింది. ఇక దేవర సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన రేపటికి నెల కావొస్తుంది.

ఇది కూడా చదవండి:  సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్!

నవంబర్ 8న స్ట్రీమింగ్

దీంతో ఓటీటీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. నవంబర్ 8న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సినిమా కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు!

చుట్టమల్లే సాంగ్

ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఓ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులోని చుట్టమల్లే చుట్టేసిందే.. అనే సాంగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడీ వీడియో సాంగ్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్

ఈ సాంగ్‌లో జాన్వీ హాట్ హాట్ అందాలు సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టున్నాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment