/rtv/media/media_files/2025/02/12/PQiH98qBzIPQmH5FWiYf.jpg)
chiranjeevi tongue slip
Chiranjeevi: లెజండ్రీ కమెడియన్ బ్రహ్మానందం(Bramhanandham), ఆయన కుమారుడు రాజా గౌతమ్(Raja Gautham) లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'బ్రహ్మా ఆనందం'. తండ్రీకొడుకులు ఈ చిత్రంలో తాతమనవాళ్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, నాగ్‍అశ్విన్ చీఫ్ గెస్టులుగా వచ్చారు.
నోరు జారిన మెగాస్టార్..
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొరపాటున మెగాస్టార్ నోటి నుంచి దొర్లిన ఓ పదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి బ్రహ్మానందం మీమ్స్ గురించి సరదాగా మాట్లాడుతూ నోరు జారారు. ''మీమ్స్ లో ఎర్రి.. అదే ఎరుపు మొహం పెడతారు కదా..'' అని అన్నారు. దీంతో వెనకాల ఉన్న బ్రహ్మానందం, నాగ్‍అశ్విన్, రాజా గౌతమ్ ఆశ్చర్యపోయారు. బ్రహ్మానందం అవాక్కై నోటిఫై చేయి వేసుకున్నారు.
వేదిక పై బూతు పదం వాడిన చిరంజీవి !
— Telugu360 (@Telugu360) February 11, 2025
" ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండీ.. ఎర్రి $%#%^ మొహం పెడతాడు కదా "
A slip of the tongue: pic.twitter.com/p4rPT4xG40
Also Read: తండేల్ కి తప్పని తిప్పలు.. మరోసారి ఏపీ ఆర్టీసీ బస్సులో పైరసీ స్క్రీనింగ్
నెటిజన్ల ట్రోలింగ్
ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి లాంటి వ్యక్తి అంతటి వేదికపై అలాంటి పదం వాడడం ఏంటి అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు ఎంతో ఉన్నతంగా మాట్లాడే చిరు.. ఇలా నోరుజారడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సరదాగా మాట్లాడే క్రమంలో కొన్ని సార్లు అలా జరుగుతుందంటూ సపోర్ట్ చేస్తున్నారు.
Also Read: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!
Also Read: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే.. స్టార్ బౌలర్లు ఔట్!