Chhaava Movie: ఛావా సినిమా చూస్తుండగా.. థియేటర్‌లో అగ్నిప్రమాదం.. వీడియో వైరల్!

ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్ థియేటర్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ‘ఛావా’ సినిమా ప్రదర్శన జరుగుతుండగా స్క్రీన్ మూలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హాల్‌లో ఉన్న ఫైర్ అలారాలు మోగడంతో ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

New Update
Fire breaks out during Chhaava screening at Delhi

Fire breaks out during Chhaava screening at Delhi

Chhaava Movie: బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన ‘ఛావా’ సినిమా ఓ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. భారీ కలెక్షన్లతో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా చూస్తుండగా అనుకోని సంఘటన జరిగింది. థియేటర్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

థియేటర్‌లో మంటలు

బుధవారం ఢిల్లీలోని సెలెక్ట్ సిటీ మాల్‌లోని సినిమా హాలులో ‘ఛావా’ ప్రదర్శన జరుగుతుండగా మంటలు చెలరేగాయి. సాయంత్రం 4:15 గంటలకు మాల్‌లోని పివిఆర్ సినిమాస్‌‌లో ‘ఛావా’ సినిమాను ప్రదర్శించారు. కొద్ది సేపటికి స్క్రీన్ మూలలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా సినిమా ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే హాలులో ఫైర్ అలారంలు మోగడం ప్రారంభించాయి. దీంతో ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ మేరకు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి మాట్లాడుతూ.. సాయంత్రం 5.42 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు కాల్ వచ్చిందని అన్నారు. దీంతో ఆరు అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. అయితే ఇది చిన్న మంట అని, ఎవరూ గాయపడలేదని, సాయంత్రం 5.55 గంటలకే మంటలను అదుపులోకి తెచ్చారని ఆయన అన్నారు. 

ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

సెలెక్ట్ సిటీవాక్ మాల్ ప్రతినిధి మాట్లాడుతూ.. పక్కనే ఉన్న మల్టీప్లెక్స్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ సంఘటన గురించి తమకు తెలిసిందని అన్నారు. తాము కూడా మల్టీప్లెక్స్ బృందానికి, అధికారులకు సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.

ఇది కూడా చూడండిఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు