Virosh's reception: విరోష్‌ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

విజయ్‌ దేవరకొండ- రష్మిక వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో విరోష్‌ జోడీ మెరిసింది. చేతిలో చెయ్యి వేసుకుని ఎంట్రీ ఇచ్చిన ఈ జంట.. తొలుత అతిథులను పలకరించి, తర్వాత సెలబ్రేషన్స్‌లో పాల్గొంది.

New Update
Virosh's reception

టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ- రష్మిక వెడ్డింగ్‌ రిసెప్షన్‌ బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయ దుస్తుల్లో విరోష్‌ జోడీ మెరిసింది. పంచకట్టులో విజయ్, చీరలో రష్మిక చేతిలో చెయ్యి వేసుకుని ఎంట్రీ ఇచ్చిన ఈ జంట.. తొలుత అతిథులను పలకరించి, తర్వాత సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటైన ఈ వేడుకకు సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, వెంకటేశ్‌, అక్కినేని నాగార్జున దంపతులు, నాగచైతన్య, రామ్‌చరణ్‌ దంపతులు, నాని కుటుంబం, నవీన్‌ పొలిశెట్టి, దర్శకుడు సుకుమార్‌ ఫ్యామిలీ, నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ, నమ్రతా శిరోద్కర్‌, ఆమె కుమార్తె సితార, రాధిక- శరత్‌కుమార్‌ దంపతులు, హాజరయ్యారు. విజయ్‌- రష్మిక వివాహం ఫిబ్రవరి 26న జరిగిన సంగతి తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు