Sonu Sood Arrest Warrant: అరెస్టు వారెంట్‌పై సోనూ సూద్ సంచలన ప్రకటన..!

నటుడు సోనూ సూద్‌పై పంజాబ్ లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోనూసూద్ స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. ఈ విషయంలో కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

New Update
sonu sood react on punjab court issues arrest warrant

sonu sood react on punjab court issues arrest warrant

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై తాజాగా పంజాబ్ లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోనూ సూద్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబైలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్‌కు కోర్టు ఆదేశించింది. ఈనెల 10 లోపు సోనుసూద్‌ను తమ ముందు హాజరుపర్చాలని కోర్టు తెలిపింది. 

ఇది కూడా చూడండి: దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?

నాకు సంబంధం లేదు

అయితే ఈ కేసు విషయంపై నటుడు సోనూ సూద్ తాజాగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సోనుసూద్ పేర్కొన్నారు. తాము బ్రాండ్ అంబాసిడర్లము కాదని.. తమకు ఏ విధంగానూ సంబంధం లేదని తెలిపారు. ఈ మేరకు సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం అని ఆయన అన్నారు. కోర్టు సమన్లపై ఈనెల 10న తన లాయర్లు ప్రకటన చేస్తారని సోనూ సూద్ తెలిపారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాము అని రాసుకొచ్చారు. 

ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే

ఏం జరిగింది..?

మోహిత్ శుక్లా అనే వ్యక్తి రిజికా కాయిన్ లో పెట్టుబడి పేరుతో రూ. 10 లక్షల మోసం చేశాడని, దీనికి నటుడు సోనూ సూద్ ప్రతక్ష్య సాక్షి అంటూ లూధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సాక్ష్యం చెప్పడానికి సోను సూద్‌ను ఆదేశించింది.

ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

అయితే కోర్టు పంపిన సమన్లకు సోనూ సూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని ఓషివారా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఆఫీసర్‌ సోనూ సూద్‌ను అరెస్టు చేయాలని లూధియానా కోర్టు ఆదేశించింది. లూథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమణ్‌ప్రీత్ కౌర్ ఈ వారెంట్ జారీ చేశారు. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు