గోల్డెన్ ఛాన్స్ అందుకున్న భీమ్స్.. మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్..!

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సాంగ్స్ తో భీమ్స్ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కూడా భీమ్స్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

New Update
bheems

టాలీవుడ్ లో సంగీత దర్శకులుగా దేవీశ్రీ ప్రసాద్, తమన్‌ల హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో అనిరుధ్ కూడా సత్తా చాటుతుండగా, ఇప్పుడు మరో తెలుగు సంగీత దర్శకుడు హవా చూపిస్తున్నాడు. తన ప్రతిభతో చిన్న సినిమాలకు కూడా భారీ హిట్లు అందిస్తున్నాడు. అతను మరెవరో కాదు భీమ్స్ సిసిరోలియో.

వెంకటేశ్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘గోదారి గట్టుమీద రామచిలకే’ పాటతో ప్రస్తుతం భీమ్స్‌ మారు మోగిపోతుంది. ఈ పాట యూట్యూబ్‌లో తక్కువ సమయంలోనే 50 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకోవడంతో పాటు, సోషల్ మీడియా రీల్స్ లో తెగ ట్రెండ్ అవుతోంది. ‘గోదారి గట్టుమీద’ పాటతో ప్రేక్షకులను అలరించిన భీమ్స్, వెంటనే ‘బ్లాక్‌బస్టర్ సంక్రాంతి’ అనే పాటతో మరింత హైప్‌ తీసుకొచ్చాడు.

Also Read : కింగ్ ఆఫ్ జంగిల్.. 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది

‘సంక్రాంతికి వస్తున్నాం’ అనిల్ రావిపూడి-వెంకటేశ్-దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో సినిమా. ఈ కాంబోలో వచ్చిన గత రెండు సినిమాలు‘ఎఫ్2’, ‘ఎఫ్3’కి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. ఈసారి భీమ్స్‌  తన మ్యూజిక్‌తో సినిమాపై హైప్ తీసుకొచ్చాడు.

రవితేజ ‘ధమాకా’తో వెలుగులోకి వచ్చిన భీమ్స్, తర్వాత ‘మ్యాడ్’ చిత్రంతో మరో విజయాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే ఆయనకు వెంకటేశ్ సినిమా చేయడానికి అవకాశం వచ్చింది. అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ పనుల్లో బిజీగా ఉంటూ, మెగాస్టార్ చిరంజీవితో తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు.

Also Read : టికెట్ రేట్లు పెంచుతుంది అందుకే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

ఈ సినిమాలో కూడా భీమ్స్‌ నే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. అదే జరిగితే భీమ్స్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం భీమ్స్ రవితేజ ‘మాస్ జాతర’, అడవి శేష్ ‘డెకాయిట్’ సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు