ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే లోకల్ బాయ్ నానిపై కేసు పెట్టి అరెస్టు చేశారు. అలాగే ఇటీవల భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. భయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు స్పెషల్ టీమ్స్ వేశారు.
ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు తాజాగా మరో 11 మంది యూట్యూబర్లపై కేసు నమోదు చేశారు. అందులో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్‌తో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విష్ణుప్రియ, టేస్టీ తేజలు ఇక జైలుకి వెళ్లడం ఖాయంలా కనిపిస్తోంది.