Betting Apps case: టాలీవుడ్ యాక్టర్లు దొంగలు.. అన్వేష్ షాకింగ్ కామెంట్స్

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన టాలీవుడ్ యాక్టర్లు దొంగలని అన్వేష్ అన్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో రూ.1000 కోట్లు చేతులు మారాయని అతడు ఆరోపించాడు. ప్రమోషన్లతో ప్రకాష్ రాజ్ కోట్లు సంపాదించాడు. రానా మెక్సికోలో టకీలా ఫ్యాక్టరీకొన్నాడని అన్వేష్ చెప్పాడు.

New Update

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టాలీవుడ్ యాక్టర్లలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మొదట 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు. తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మరో 25 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో సినీ ప్రముఖులు రానా దగ్గుపాటు, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచులక్ష్మీ లు ఉన్నారు. సోషల్ మీడియా సెలబ్రెటీల్లో భయ్యా సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, సురేఖా వాణి కూతురు సుప్రిత, హర్ష సాయి, టేస్టీ, యాంకర్లు విష్ణు ప్రియా,  శ్యామల, రితూ చౌదరీలు ఉన్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై వ్యతిరేకంగా పోరాడుతున్న యుట్యూబర్ (నా అన్వేషణ) అన్వేష్ శనివారం షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Also read: Viral news: భర్తతో గొడవపడి అది కొరికేసిన భార్య.. చేతిలో పట్టుకొని హస్పిటల్‌కు పరుగులు

 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో రూ.1000 కోట్లు చేతులు మారాయని అన్వేష్ ఆరోపించాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అన్వేష్ టాలీవుడ్ నటులు దొంగలు అంటూ ఓ వీడియో చేసి పోస్ట్ విడుదల చేశాడు. ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మి, దగ్గుబాటి రానా, విజయ్‌దేవరకొండ టార్గెట్‌గా చేసి ప్రధానంగా అన్వేష్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇది టాలీవుడ్ కాదు.. బెట్టింగ్ టాలీవుడ్ అని అతను వీడియోలో అంటున్నాడు. బెట్టింగ్‌ యాప్స్‌తో ప్రకాష్ రాజ్ కోట్లు సంపాదించారు. బెట్టింగ్ డబ్బులతో రానా మెక్సికోలో టకీలా ఫ్యాక్టరీకొన్నాడని అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు. డబ్బులు పెట్టి నష్టపోయిన బాధితులకు ప్రమోటర్స్ ఏం చేశారన్న అన్వేష్ ప్రశ్నించాడు.

Also read: AI Grok: తిడితే నవ్వుతున్నాడేంటి.. గ్రోక్‌ బూతు రిప్లేలపై ఎలన్ మస్క్ రియాక్షన్ ఇదే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు