Balayya Vs Venkatesh: బాలయ్య Vs వెంకీమామ.. ఇద్దరిలో సంక్రాంతి విన్నర్ ఎవరు?

సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లను వెనక్కి నెట్టి వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీ మొదటి నాలుగు రోజుల్లోనే రూ.131 కోట్ల గ్రాస్ వసూలు చేసి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. 

New Update
balayya vs venkatesh

balayya venkatesh

ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 'గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ లతో పోలిస్తే రిలీజ్ కు ముందు 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీపై మరీ అంత భారీ అంచనాలేమీ లేదు. కానీ ఆ రెండు సినిమాలను వెనక్కి నెట్టి వెంకటేశ్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది.  

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొదటి నాలుగు రోజుల్లోనే రూ.131 కోట్ల గ్రాస్ వసూలు చేసి, సంక్రాంతి సీజన్ విన్నర్‌గా నిలిచింది. గత ఏడాది 'సైంధవ్' సినిమాతో నిరాశకు గురైన వెంకటేశ్, ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు. విడుదలకు ముందు తక్కువ అంచనాలు ఉన్నప్పటికీ, ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలను అందించింది. 

Also Read :  జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. MAAకు మాధవీలత ఫిర్యాదు

ఇక సంక్రాంతి రేసులో అత్యధిక బజ్ క్రియేట్ చేసిన గేమ్ ఛేంజర్ సినిమా  ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. మరోవైపు, బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' మంచి స్పందనను అందుకొని రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే ఐదు రోజుల్లోనే రూ.114 కోట్ల గ్రాస్ వసూలు చేసి, బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకునే దిశగా ఉంది. ఈ వీకెండ్ కల్లా లాభాల్లోకి వెళ్లే అవకాశముంది. సో ఈ లెక్కల్ని బట్టి ఈ ఏడాది సంక్రాంతి సినిమాల విన్నర్ వెంకీమామ 'సంక్రాంతికి వస్తున్నాం' అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read :  సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు