గేమ్ ఛేంజర్ తర్వాత అందరూ ఆసక్తి చూస్తున్న రామ్ చరణ్ సినిమా పెద్ది. ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై హైప్స్ పెంచేసిన మూవీ దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తానంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ దీని కోసం ఆతృతగా ఎదురు చేస్తున్నారు.
పెద్ది గ్లింప్స్ పై క్రేజీ పోస్ట్ లు..
టైటిల్ ఎంత క్రేజీగా ఉందో ఇందులో చరణ్ లుక్ కూడా అంతే క్రేజీగా చాలా మాస్ అండ్ రస్టిక్ ఉంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో చరణ్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. 'ఉప్పెన' తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ కథను సిద్ధం చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పుడు గ్లింప్స్ శ్రీరామ నవమి రోజు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పెద్ది' మూవీ గ్లింప్స్ ని ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. రేపు (ఏప్రిల్ 6) ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దీనిపై తాజాగా రామ్ చరణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గ్లింప్స్ చూసిన తర్వాత సూపర్ ఉత్సాహంగా ఉంది. ఇది మీకు కూడా చాలా నచ్చుతుంది అంటూ అందులో రాశారు. ఈ సందర్భంగా ఓ వీడియోని కూడా షేర్ చేసారు. దీనిపై బుచ్చిబాబు రియాక్ట్ అవుతూ ఏఆర్ రెహమాన్, చరణ్ అదరగొట్టారనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు.
today-latest-news-in-telugu
Also Read: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ