RGV: ఆర్జీవీ అరెస్ట్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. డిసెంబర్ 9 వరకు

రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ ఆర్జీవీ పెట్టుకున్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇవాళ విచారించింది. ఆర్జీవీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

New Update
RGV (2),

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ ఆర్జీవీ పెట్టుకున్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇవాళ విచారించింది. ఈ మేరకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

ఇది కూడా చదవండి: బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

ఇందులో భాగంగా ఆర్జీవీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకూ అంటే డిసెంబర్ 9 వరకూ ఆర్జీవీని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 

ఏం జరిగింది..?

ఇది కూడా చదవండి: దేశంలో నల్లధనం పెరుగుతోంది.. అంబానీ, అదానీకే అడ్డగోలు మాఫీలు!

గతంలో వైసీపీ హయంలో అప్పటి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అలాగే ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ టైంలో వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై ఆర్జీవీపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. 

ఈ మేరకు ఆర్జీవీని ఒంగోలు పోలీసులు విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని.. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆర్జీవి పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆయనకు బిగ్ రిలీఫ్ అందించింది.

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

నేనెక్కడికీ పారిపోలేదు: ఆర్జీవీ

అలాగే ఆర్జీవీని పోలీసులు అరెస్ట్ చేయనున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై ఇటీవల స్పందించిన ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానేను ఏదో పరారీలో ఉన్నానని.. ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు తన కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అన్నారు. ఎందుకంటే ఈ టైమ్ అంత తాను తన డెన్ ఆఫీసులోనే ఉన్నానని.. అప్పుడప్పుడు తన సినిమా పనుల కోసం బయటకి వెళ్ళానని తెలిపారు. అంతేకాకుండా పోలీసులు ఇంత వరకు తన ఆఫీసులోకి కాలే పెట్టలేదన్నారు. పైగా తనను అరెస్టు చేయడానికి వచ్చినట్లు తన మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదని..  ఒక వేళ తనను అరెస్టు చేయడానికే వస్తే తన ఆఫీసులోకి ఎందుకు రారు? అని ప్రశ్నించారు. 

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు