/rtv/media/media_files/2026/02/18/anupama-new-movie-2026-02-18-13-27-33.jpg)
Anupama new movie
కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(anupama-parameshwaran) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే హారర్ థ్రిల్లర్ 'కిష్కిందపురి' సినిమాతో సూపట్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరో ప్రాజెక్ట్ తో సిద్ధమైంది. నేడు అనుపమ పుట్టినరోజు(Happy Birthday Anupama Parameshwaran) సందర్భంగా మేకర్స్ తన కొత్త మూవీని అనౌన్స్ చేశారు. ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్, బెంచ్మార్క్ స్టో రీటెల్లర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్జే షాన్ దర్శకత్వం వహిస్తున్నారు. శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా టైటిల్ త్వరలోనే ప్రకటించనున్నారు.
తొలిసారి బిగ్ స్క్రీన్ పై
నిర్మాత ప్రేరణ అరోరా గతంలో రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి సూపర్ చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఇప్పుడు అనుపమ ప్రాజెక్ట్ లో ఆమె భాగం కావడం ఆసక్తికరంగా మారింది. ఒక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ ప్రాజెక్టు రూపొందనుంది. అయితే గతంలో డైరెక్టర్ షాన్- అనుపమ కాంబినేషన్ లో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సూపర్ హిట్ కాంబో ఇప్పుడు తొలిసారి బిగ్ స్క్రీన్ పై మెరవనుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. మే లేదా జూన్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/02/18/anupama-parameswaran-2026-02-18-13-47-59.jpeg)
అనుపమ తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్ గా కేవలం కొన్ని నిమిషాలకే పరిమితమవకుండా.. బలమైన పాత్రలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతోంది. డిఫరెంట్ జానర్స్ లో కనిపిస్తూ తన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తోంది ఈ బ్యూటీ. రీసెంట్ గా 'పరదా' అంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తెలుగులో అనుపమ కార్తికేయ 2, రాక్షసుడు, ఆహా, డీజీ టిల్లు 2, హలో గురు ప్రేమ కోసమే, ప్రేమమ్ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది.
Also Read: Suhas Hey Balawanth: 'నువ్వు కూడా హీరోవా..?' ‘హే బలవంత్’ ప్రమోషన్లో హీరో సుహాస్ ఎమోషనల్..!
Follow Us