/rtv/media/media_files/2025/03/23/paK90mAcfoGIiPbhwpqx.jpg)
allu arjun at Swami Narayan Mandir in Abu Dhabi
Allu Arjun: సంధ్యా థియేటర్ ఎపిసోడ్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈవెంట్లలో, మీడియా ముందు పెద్దగా కనిపించలేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ అబుదాబిలోని బీఏపీఎస్ స్వామి నారాయణ మందిరాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అబుదాబిలోని ఈ ఆలయం తొలి రాతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. బన్నీ అక్కడికి చేరుకున్న అనంతరం ప్రతినిధులు ఆయనకు ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. అలాగే అల్లు అర్జున్ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. 2024 ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చూడండి: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!
అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్ ను సందర్శించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
— RTV (@RTVnewsnetwork) March 23, 2025
ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. నారాయణ స్వామిని దర్శించుకున్న అల్లు అర్జున్
అక్కడి ప్రతినిధులు అల్లు అర్జున్ కి ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు.
అర్జున్-అట్లీ కాంబోలోని మూవీ షూటింగ్… pic.twitter.com/DjP6hVUrdh
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో
ఇదిలా ఉంటే రీసెంట్ గా 'పుష్ప2' తో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు బన్నీ. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా 'పుష్ప2' రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1871 పైగా కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం బన్నీ భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రూ. 175 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాదు లాభాల్లో 15%శాతం వాటా ఇచ్చేలా మూవీ నిర్మాణ సంస్ధ 'సన్ పిక్చర్స్' తో బ్యాకెండ్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
telugu-news | latest-news | cinema-news | allu-arjun
Also Read: Court Premalo Song: "కథలెన్నో చెప్పారు.. కవితల్నీ రాశారు.." ప్రేమలో ఫుల్ వీడియో సాంగ్ చూశారా..?