నాగవంశీ అదిరే అప్డేట్.. బన్నీ-త్రివిక్రమ్ మైథలాజికల్ డ్రామా.. అప్పుడే జీబ్లీ ఫొటోలు వైరల్!

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ అప్డేట్ పంచుకున్నారు నిర్మాత నాగవంశీ. మైథలాజికల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

New Update

Allu Arjun:  'పుష్ప2' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశమంతా మారుమోగింది. భారీ అంచనాల మధ్య గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. 

Also Read: Allu Arjun: ఇకపై మారనున్న అల్లు అర్జున్ పేరు? కొత్త పేరు ఏంటంటే

అక్టోబర్ లో షూటింగ్ 

ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈమూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. అలాగే మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని తెలిపారు. పురాణాల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కుమారస్వామి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

జీబ్లీ ఇమేజ్ లు

దీంతో బన్నీ లుక్ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అప్పుడే  సోషల్ మీడియాలో కుమారస్వామిగా అల్లు అర్జున్ జీబ్లీ ఇమేజ్ లు క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి #AA22 అనే పాన్ ఇండియా మూవీ లైన్లో పెట్టారు బన్నీ.  ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్  అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. 

 latest-news | cinema-news | allu-arjun

ఇది కూడా చూడండి:  ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actor Ravi Kumar: మరో ప్రముఖ నటుడు కన్నుమూత.. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో విషాదం

మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రవికుమార్ కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అల్లాఉద్దీన్ అద్భుత విళక్కు, ఆనంద రాగం’ వంటి సినిమాల్లో నటించారు.

New Update
ACTOR RAVI KUMAR PASSED AWAY

ACTOR RAVI KUMAR PASSED AWAY

Actor Ravi Kumar:  ఈరోజు ఉదయం బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ మరణ వార్త  సినీ ప్రియులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇంతలోనే మలయాళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తమిళ్, మలయాళ చిత్రాలతో గుర్తింపు పొందిన ప్ర‌ముఖ న‌టుడు రవి కుమార్  క‌న్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో.. చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు రవికుమార్ కొడుకు సోషల్ మీడియాలో ప్రకటించారు. రవికుమార్ మృతి పట్ల తమిళ్, మలయాళం సినీ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు. 

Also Read: Viral News: తల్లికి, బిడ్డకు ఒకేసారి కడుపు చేసిన యూట్యూబర్.. నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రచ్చ రచ్చ!

Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్స్ కాదు.. ఎన్నంటే!

1975లో ఇండస్ట్రీలోకి 

కేరళలోని త్రిసూర్‌ లో జన్మించిన రవి కుమార్ 1975లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళం, తమిళ్లో అనేక చిత్రాల్లో నటించారు. మలయాళంలో  ఉల్లాస యాత్ర’, ‘అవరగళ్’, ‘సీబీఐ 5’, ‘పరమానందం’ వంటి చిత్రాలతో బాగా గుర్తింపు పొందారు. అలాగే తమిళ్లో ఆనంద రాగం,  అల్లాఉద్దీన్ అద్భుత విళక్కు సినిమాలు చేశారు. 

 telugu-news | cinema-news

ఇది కూడా చదవండి: Delhi Liquor Scam: కవిత అరెస్టుకు కారణాలేంటి? అసలు ఈ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఏంటి?

Advertisment
Advertisment
Advertisment