/rtv/media/media_files/2025/02/28/YiLBGyPlleZEBpMA7f4H.jpg)
pushpa 2 song at NBA
Pushpa 2: అల్లు అర్జున్ 'పుష్ప2' ప్రపంచవ్యాప్తంగా సంచలనం సంచలనం సృష్టించింది. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ సినిమాకు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. అయితే ఈ సినిమాతో పాటు ఇందులోని పాటలు కూడా అంతే హిట్ అయ్యాయి. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. తాజాగా పుష్ప2 లోని 'పీలింగ్స్' పాటను NBA (National Basketball ) లీగ్ లో ప్రదర్శించారు. ఫిబ్రవరి 26న టయోటా సెంటర్‌లో హూస్టన్ రాకెట్స్ vs మిల్వాకీ బక్స్ మధ్య మ్యాచ్ జరగగా.. హాఫ్-టైమ్ బ్రేక్ లో స్టేజ్ పై నృత్యకారులు ఈ పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయల్ బ్లూ, గోల్డ్ దుస్తులను ధరించి నృత్యకారులు ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శన ఇచ్చారు. 'పీలింగ్స్' సాంగ్ ప్రదర్శన సమయంలో స్టేడియంలోని వీక్షకులంతా కేరింతలతో తెగ ఎంజాయ్ చేశారు. గతంలో NBA హాఫ్-టైమ్ బ్రేక్ లో మహేష్ బాబు- శ్రీలీల 'కుర్చీ మడతపెట్టి ' పాటను ప్రదర్శించారు.
Tribute to Icon star @alluarjun & #Pushpa2 at Houston Rockets Vs Milwaukee Bucks game half time stage at @NBA 🔥
— Allu Arjun TFC™ (@AlluArjunTFC) February 27, 2025
A proud moment showcasing Indian cinema and culture on a global platform! 🌎🇮🇳 #Peelings #Pushpa2TheRule #AlluArjun pic.twitter.com/bzVwltVqoW
16 మిలియన్ వ్యూస్
అల్లు అర్జున్ - రష్మిక మందన్న డ్యూయెట్ గా వచ్చిన 'పీలింగ్స్' పాట అభిమానులలో భారీ హిట్ అయ్యింది. కేవలం రెండు నెలల్లోనే యూట్యూబ్ ఈ వీడియో సాంగ్ 16 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప2' ప్రపంచవ్యాప్తంగా రూ. 1,800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read: రజినీకాంత్ స్పెషల్ సాంగ్ కోసం పూజ భారీ రెమ్యునరేషన్.. ఏకంగా ఒక సినిమాకు ఛార్జ్ చేసేంత