'పుష్ప 2' సినిమాలో మరో 20 నిముషాల ఫుటేజ్ ను యాడ్ చేసి జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్ మెంట్ తో బన్నీ ఫ్యాన్స్ లో మరింత జోష్ వచ్చింది. దీంతో సంక్రాంతికి 'పుష్ప2' రీ లోడెడ్ వెర్షన్ ను థియేటర్స్ లో చూడాలని ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి తరుణంలో మూవీ టీమ్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. 'పుష్ప-2' రీ లోడింగ్ వర్షన్ తేదీని మార్చేసింది. ముందుగా ప్రకటించిన డేట్ కాకుండా జనవరి 17న తీసుకు రానున్నట్లు తెలిపింది. సంబంధిత కంటెంట్ విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతోందని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. Also Read : 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్ #Pushpa2Reloaded in cinemas from January 17th. #Pushpa2 #Pushpa2TheRule#WildFirePushpa https://t.co/rLmX4PECLf pic.twitter.com/XXcmRoOVts — Mythri Movie Makers (@MythriOfficial) January 8, 2025 అయితే ఈనెల 10న రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' రిలీజ్ కానుంది. ఈ సినిమా వచ్చిన మరుసటి రోజే 'పుష్ప2' రీ లోడెడ్ వెర్షన్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 రీ లోడింగ్ తేదీని మార్చడంపై నెట్టింట చర్చ మొదలైంది. 'పుష్ప' మేకర్స్ ప్లాన్ పై మెగా ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు వచ్చాయని తెలుస్తోంది. అందుకే గేమ్ ఛేంజర్ రిలీజ్ అయిన వారం రోజులకు పుష్ప - 2 రీ లోడెడ్ వెర్షన్ ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు డిసైడ్ అయినట్లు ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. దానికి తోడు ఇప్పటికే అల్లు అర్జున్, మైత్రీ నిర్మాతలు ఈ సినిమా విషయంలో ఎన్నో వివాదాలు ఎదుర్కున్నారు. Also Read : 'పుష్ప' చీటింగ్.. మూవీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్ ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' కి అలాగే సంక్రాంతి సినిమాలకు అడ్డు పడితే అనవసరంగా ఇంకో వివాదంలో ఇరుక్కోవాల్సి వస్తుందనే..పొంగల్ సీజన్ అయ్యాక రావాలని భావించి జనవరి 17 కి డేట్ మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.