Pushpa2 : 'పుష్ప' చీటింగ్.. మూవీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్

'పుష్ప 2' సినిమాలో మరో 20 నిముషాల ఫుటేజ్ ను యాడ్ చేసి రిలీజ్ చేస్తుండటంపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి.. మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

New Update
pushpa the rule

allu arjun pushpa the rule

అల్లు అర్జున్ 'పుష్ప2' మూవీకి సంబంధించి నిన్న మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 'పుష్ప 2' సినిమాలో మరో 20 నిముషాల ఫుటేజ్ ను యాడ్ చేసి జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ వార్త టాలీవుడ్ లో చర్చగా మారింది. 

మూవీ టీమ్ తీసుకున్న ఈ డెసిషన్ పై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 3 గంటల 21 నిమిషాల రన్ టైం తో రిలీజ్ చేసినప్పుడే సినిమా బాగా ల్యాగ్ అయిందని, నిడివి తగ్గించాల్సి ఉండేదని కామెంట్స్ వచ్చాయి. అదే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మరో 20 నిమిషాలు యాడ్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

Also Read :  బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జాన్వీ.. అతనితో నిశ్చితార్థం

ఇప్పుడు యాడ్ చేసిన సీన్స్ తో కలుపుకుంటే 3 గంటల 40 నిమిషాలకు పైగా రన్ టైం తో మళ్ళీ థియేటర్స్ లో సినిమా చూడాలంటే ఇది ఆడియన్స్ పేషెన్స్ కు పెద్ద పరీక్షలాంటిది. ఈ పనేదో రిలీజ్ అయిన వారంలోపు చేసి ఉంటే బాగుండేది కదా! అని మరి కొందరు అంటున్నారు. 

మరోవైపు అసలు సంక్రాంతి సినిమాలు ఉన్న సమయంలో దీనికి థియేటర్స్ ఎలా ఇస్తారు? అసలే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సంక్రాంతి టైమ్ లో 'పుష్ప2' మేకర్స్ కలెక్షన్స్ కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతుంది. 

Also Read :  'కొండ దేవర' సాంగ్ వచ్చేసింది.. దుమ్ములేపిన రామ్ చరణ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు