Pushpa 2 pre release event
Pushpa 2 Pre Release : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఏకంగా 1200 కి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతూ.. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలువనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేశారు మేకర్స్.
Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా
మల్లారెడ్డి కాలేజీలో పుష్ప2 ఈవెంట్
పుష్ప 2 ప్రీ రిలీజ్ హైదరాబాదులో డిసెంబర్ 1న మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా ఎల్బీ స్టేడియంలో భారీగా నిర్వహించాలని ప్లాన్ చేయగా.. అందుకు తగిన పర్మిషన్స్ లభించలేదు. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో చేయాలని అనుకున్నారు. కానీ.. అది కూడా కుదరకపోవడంతో మల్లారెడ్డి కాలేజీలో ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ అభిమానులు పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Pushpa 2: పుష్ప 2 సినిమా మొత్తం లైవ్‌లో పెడతా.. ఆడియో లీక్..!
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా రన్ టైం మూవీ పై మరింత ఆసక్తిని పెంచుతోంది. పుష్ప2 రన్ టైం 3 గంటల 20 నిమిషాలు ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్రం బృందం ముఖ్య నగరాల్లో మూవీ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పై సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటించగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. పుష్ప-2 మూవీని లీక్ చేయడానికి కుట్రలు జరుగుతున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా బాలేదని ప్రచారం చేయాలి అంటూ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. VPNతో ఐపీ అడ్రస్ సినిమా మొత్తం లైవ్ లో పెడదాము అని మాట్లాడుకున్నట్లు ఆడియోలో వినిపించింది.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
Also Read : ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు!