Pushpa2: 'బాహుబలి 2' ని రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప2'.. లేటెస్ట్ కలెక్షన్స్ ఎంతంటే?

అల్లు అర్జున్ 'పుష్ప2' మూవీ మరో రికార్డు నెలకొల్పింది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు గ్రాస్‌ రాబట్టి 'బాహుబలి2' (రూ.1810 కోట్లు) కలెక్షన్స్ ను బ్రేక్ చేసింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచింది.

author-image
By Anil Kumar
New Update
pushpa 2 movie latest collections

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప 2' మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా ఇప్పుడు మరో రికార్డు నెలకొల్పింది. 

ఈ మూవీ 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు గ్రాస్‌ రాబట్టింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు (హయ్యెస్ట్‌ గ్రాస్‌) సాధించిన సినిమాగా(Highest Grossing Indian Movies).. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఇండియా నుంచి అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్ లో ‘దంగల్’ (రూ. 2 వేల కోట్లకుపైగా) ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ఆ  తర్వాత ఇప్పటి వరకూ రెండో ప్లేస్‌లో ఉన్న ‘బాహుబలి 2’ రూ.1810 కోట్లతో ఉంది.

ఇప్పుడు 'బాహుబలి2' రికార్డును 'పుష్ప2' రూ.1831కోట్ల వసూళ్లతో బ్రేక్‌ చేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేనియా ఇలాగే కొనసాగితే త్వరలోనే 2 వేల కోట్ల క్లబ్‌లోకి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.

Also Read :  మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్‌..అసలేమైందంటే!

మరోవైపు బాలీవుడ్ లో ఓపెనింగ్‌ రోజు జవాన్‌, RRR రికార్డులను బద్దలు కొట్టి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన 'పుష్ప 2'.. ఇప్పటికే బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద రూ.806 కోట్లు గ్రాస్‌ వసూళ్లు చేసి నంబర్‌ 1 స్థానంలో నిలిచింది. 31 రోజుల్లో ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు