ఇవాళ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు స్పెషల్ విషెస్ చెబుతున్నారు. మరోవైపు జగన్ బర్త్ డే వేడుకలను ఆయన ఫ్యాన్స్ ఎక్కడికక్కడే నిర్వహిస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు
జగన్ ఫ్లెక్సీలో బన్నీ ఫొటో కలకలం
గ్రూపులు గ్రూపులుగా బ్యానర్లు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పుట్టినరోజు బ్యానర్‌లో అల్లు అర్జున్ ఫోటో కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటోను వైసీపీ క్యాడర్ ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా ఆ బ్యానర్‌లో ఒక పవర్ ఫుల్ కొటేషన్ కూడా రాసుకొచ్చారు.
‘‘రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అంతా ఏకం అవుతారు’’ అంటూ కూటమిని ఉద్దేశించి బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బ్యానర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పుడిప్పుడే అల్లు ఫ్యామిలీ - మెగా ఫ్యామిలీ దగ్గరవుతున్న వేళ ఈ ఫ్లెక్సీ కలకలం రేపింది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు
జగన్ పుట్టినరోజు బ్యానర్ లో అల్లు అర్జున్ ఫోటో కలకలం..
— RTV (@RTVnewsnetwork) December 21, 2024
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా జగన్ ఫోటో తో అల్లు అర్జున్ ఫోటో ఏర్పాటు చేసిన వైసీపీ క్యాడర్..
రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అంతా ఏకం అవుతారంటూ కూటమి ని ఉద్దేశించి బ్యానర్ వేసిన వైసీపీ..
ఇప్పటికే జగన్… pic.twitter.com/GSCPVSQGJH
మెగా ఫ్యామిలీలో మరో చిచ్చు
ఇక మరోవైపు అల్లు అర్జున్‌కు బెయిల్ ఇప్పించడంలో వైఎస్ జగన్ లాయర్ నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడని తెలిసిందో మెగా ఫ్యామిలీ తమ కోపాన్ని, ద్వేషాన్ని పక్కన పెట్టి అల్లు ఇంటికి వెళ్లింది. చిరంజీవి, ఆయన భార్య సురేఖ, నాగబాబు సహా మెగా ఫ్యామిలీ అంతా అల్లు ఫ్యామిలీని పరామర్శించి ఓదార్చింది.
Also Read: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు!
ఇక అల్లు అర్జున్ బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లాడు. భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్లాడు. చిరంజీవిని, నాగబాబుని కలిసాడు. కొద్ది సేపు వారితో ముచ్చటించాడు. ఇలా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ దగ్గరవుతున్న టైమ్‌లో వైసీపీ బ్యానర్లు హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ బ్యానర్లపై అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.
Also Read: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలు మారాయి!