అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా నిన్న అంటే డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అదే సమయంలో ఈ సినిమా ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ భారీగా వచ్చారు. Also Read: సుధామూర్తి అమ్మ ప్రేమ..ముగ్ధుడైన ఏపీ మంత్రి! దీంతో థియేటర్ ముందు తొక్కిలసట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. Also Read: అన్నదాత సుఖీభవ...రైతుల అకౌంట్ లో రూ.20 వేలు! ఈ ఘటనపై పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ స్పందించారు. బాధితులకు అండగా ఉంటామని ట్వీట్ చేశారు. పుష్ప ప్రీమియర్ స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాదం సంఘటనకు ఎంతో భాదపడ్డాము. ఆ కుటుంబానికి, అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న పిల్లవాడికి మా ప్రార్థనలు ఉంటాయి. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి సాధ్యమైనంత సహాయాన్ని అందించడానికి అందించడానికి సిద్ధంగా ఉన్నాయి అంటూ పోస్ట్ పెట్టారు. Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు సంధ్య థియేటర్స్ యాజమాన్యం పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే థియేటర్స్ యాజమాన్యం కేసు నమోదు చేశారు. అదే సమయంలో అల్లు అర్జున్ పై సైతం హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. Also Read: Bangladesh: జైళ్ల నుంచి 700 మంది పరారీ..బంగ్లాలో మరో కొత్త తలనొప్పి! అల్లు అర్జున్‌పై కేసు నమోదు సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్‌పై బీఎన్ఎస్‌లోని సెక్షన్ 105,118(1) r/w 3(5) కింద కేసు నమోదైనట్టుగా వెల్లడించారు. అల్లు అర్జున్ హౌస్ అరెస్ట్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఇలాంటి ఘటన మరే థియేటర్ వద్ద జరగకూడదని పోలీసులు బన్నీని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ మరే థియేటర్ వద్దకు వెళ్లినా.. జనాలు పోగు అవుతారని.. అదే సమయంలో తోపులాట జరిగే ప్రమాదం ఉందని భావించి పోలీసులు బన్నీని హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం.