ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పో..సంచలన వీడియో బయటపెట్టిన బన్నీ ఫ్యాన్స్!

అల్లు అర్జున్ ఫ్యాన్స్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. రేవతి చనిపోయిన విషయం తనకు ఉదయం 3 గంటల వరకు చెప్పలేదని ఆమె భర్త మాట్లాడిన వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆమె భర్తకే 3 గంటల వరకు తెలియదన్నప్పుడు 12 గంటలకు వెళ్లిన బన్నీకి ఎలా తెలుస్తుందని వాదిస్తున్నారు.

New Update
Allu Arjun Revathi Husband Video

రేవతి భర్త, అల్లు అర్జున్ (ఫైల్ ఫొటో))

అల్లు అర్జున్ పై నెటిజెన్లు దుమ్ముత్తి పోస్తున్నారు. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో నిన్న చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా భారీగా పోస్టులు పెడుతున్నారు. #alluarjunarrested హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సినిమా ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే తాను థియేటర్ నుంచి వెళ్లిపోయానని అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే.. ఆయన జాతర సీన్ వరకూ థియేటర్లోనే ఉన్నారంటూ ప్రూఫ్ లతో సహా నెటిజెన్లు వీడియోలను పోస్ట్  చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అబద్ధాలు చెప్పకు పుష్ప.. ఇదిగో ప్రూఫ్.. కాంగ్రెస్ నేత సంచలన వీడియో

బన్నీకి మద్దతుగా రంగంలోకి ఫ్యాన్స్..

మరో వైపు రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా థియేటర్ నుంచి నేరుగా వెళ్లిపోకుండా ఆయన రూఫ్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ కు మళ్లీ చేతులు ఊపినట్లు కూడా వీడియోలను పోస్టు చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోకు మద్దతుగా వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయం వరకు తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం తనకు తెలియదని అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే.. బన్నీ అబద్ధాలు చెబుతున్నాడంటూ నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్

దీంతో ఈ ఘటనపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. రేవతి చనిపోయిన విషయం ఉదయం 3 గంటలకు తనకు పోలీసులు చెప్పారని ఆమె భర్త గతంలో ఓ ఛానల్ తో మాట్లాడారు. ఆ వీడియోను ఇప్పుడు బన్నీ ఫ్సాన్ వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ రాత్రి 12 గంటలకే థియేటర్ నుంచి వెళ్లిపోయారని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు. 3 గంటల వరకు బాధిత మహిళ భర్తకే ఆమె చనిపోయిన విషయం తెలియదని.. ఈ క్రమంలో 12 గంటలకు థియేటర్ నుంచి వెళ్లిపోయిన తమ హీరోకు ఎలా తెలుస్తుందని వాదిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ అతి.. ఇదే తగ్గించుకుంటే మంచిది..' సోషల్ మీడియాలో రేవంత్ ఫ్యాన్స్ హల్చల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు