/rtv/media/media_files/2025/04/06/JapYp3jUjjRxyxKxmaPr.jpg)
allu arjun- Atlee movie Priyanka chopra as female lead
Allu Arjun-Atlee: అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రాబోతున్న #A6 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6న బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అధికారిక చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. పలు నివేదికల ప్రకారం.. ఇందులో ఫీమేల్ లీడ్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ అట్లీ. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంది.
ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు
#AlluArjun’s #AA22 Latest reports about female lead. #PriyankaChopra In consideration!! pic.twitter.com/cMYbqoRavO
— Cinema Pichii (@CinemaPichii) April 5, 2025
ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!
అయితే అట్లీ 'జవాన్' సినిమా మాదిరిగానే అల్లు అర్జున్ కూడా ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అద్భుతమైన విజువల్స్, పవర్ ఫుల్ యాక్షన్, అట్లీ స్పెషల్ టచ్ ఈమూవీలో ఉండబోతున్నాయి. దీంతోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో పౌరాణిక చిత్రాన్ని లైన్లో పెట్టారు అల్లు అర్జున్. ఇందులో బన్నీ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాల్లో టాక్. ఇదిలా ఉంటే.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి ssmb29 లో బిజీగా ఉంది. సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కోసం ప్రియాంక అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చింది.
telugu-news | cinema-news | latest-news | allu-arjun-atlee-movie | priyanka-chopra
ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!