సురేఖ సిగ్గు లేకుండా మాట్లాడింది: అక్కినేని అఖిల్ ఫైర్

కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖపై అక్కినేని అఖిల్ ఫైర్ అయ్యాడు. మంత్రి హోదాలో ఉండి సురేఖ సిగ్గులేకుండా మాట్లాడింది అంటూ మండిపడ్డాడు. సురేఖ లాంటి వ్యక్తులకు ఈ సమాజంలో చోటు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆమె లాంటి వ్యక్తులను అసలు క్షమించకూడదన్నాడు.

New Update
konda surekha

కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖకు అక్కినేని అఖిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి, హాస్యాస్పదమైనవని మండిపడ్డాడు. సురేఖ కామెంట్స్ అత్యంత అసభ్యకరం, జుగుప్సాకరంగా ఉన్నాయని ఫైర్ అయ్యాడు. ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి నైతికత కోల్పోయి ప్రవర్తించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నేను మౌనంగా ఉండను

సురేఖ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదని.. ఆమె వ్యాఖ్యలతో తమ కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని పేర్కొన్నాడు. రాజకీయ స్వలాభం కోసం నిజాయితీ గల వ్యక్తులపై సురేఖ సిగ్గు లేకుండా మాట్లాడింది అంటూ చిర్రెత్తిపోయాడు. అక్కినేని కుటుంబ సభ్యుడిగా ఈ విషయంలో నేను మౌనంగా ఉండనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. సురేఖ లాంటి వ్యక్తులకు ఈ సమాజంలో చోటు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆమె లాంటి వ్యక్తులను అసలు క్షమించకూడదన్నాడు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 

కాగా ఇటీవల నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ వల్లే నాగ చైతన్య, సమంత విడిపోయారని షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌ను అడ్డుపెట్టుకుని సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశాడని.. సమంత దానికి ఒప్పుకోలేదని.. దీని కారణంగానే ఆమె అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటకొచ్చేసిందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ గట్టి కౌంటరే ఇచ్చాడు. ఆయనతో పాటు అమల కూడా స్పందించారు. ఆపై నాగచైతన్య, సమంత కూడా రియాక్ట్ అయ్యారు.  

అయితే ఒక్క అక్కినేని ఫ్యామిలీయే కాకుండా యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం నోరు విప్పింది. చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, సహ మరెంతో మంది కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో ఆమె సమంతకు క్షమాపణలు కోరింది. అయితే ఈ విషయంపై నాగార్జున మాత్రం వెనక్కి తగ్గలేదు. నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశాడు. తన కుటంబానికి భంగం కలిగించారని.. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

Also Read :  కేక్‌ తింటే క్యాన్సర్.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఫుడ్ కార్పోరేషన్

Advertisment
Advertisment
తాజా కథనాలు