Varalakshmi Sarath Kumar: పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు.. కానీ: వరలక్ష్మీ షాకింగ్ వ్యాఖ్యలు!

పెళ్లి గురించి తానెప్పుడూ ఆలోచించలేదని నటి వరలక్ష్మి అన్నారు. అసలు చేసుకోవాలనే ఉద్దేశం ఉండేది కాదన్నారు. కానీ పెళ్లి తర్వాత తనభర్త నికోలయ్‌ జీవితం ఎంతో మారిందని తెలిపారు. ఆయన తన కోసం హైదరాబాద్‌ షిఫ్ట్ అయ్యారని.. పేరును కూడా మార్చుకున్నారని చెప్పుకొచ్చారు.

New Update
varalaxmi sarathkumar on her marriage life and husband Nicholai Sachdev life change interesting comments

varalaxmi sarathkumar on her marriage life and husband Nicholai Sachdev life change interesting comments

Varalakshmi Sarath Kumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. సినిమా ఏదైనా, పాత్ర ఎలాంటిదైన ఈ అమ్మడు తన యాక్టింగ్‌ అదరగొట్టేస్తుంది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మలయాళ స్టార్ హీరో శరత్‌కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ నటిగా పేరు సంపాదించుకున్నారు.

ప్రేమ పెళ్లి

అయితే ముద్దుగుమ్మ వరలక్ష్మి గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన చిన్న నాటి మిత్రుడు నికోలయ్ సచ్‌దేవ్‌(Nicholai Sachdev)తో ఏడడుగులు వేశారు. ఇక తన పెళ్లి తర్వాత కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగడంపై ఆమె తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తర్వాత తన భర్త నికోలయ్ జీవితం మారింది.. కానీ తన జీవితం ఏమీ మారలేదని అన్నారు. 

Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!

నికోలయ్ జీవితంలో మార్పులు

నికోలయ్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఆయన తనకోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారని.. తన పేరును కూడా నికోలయ్ సచ్‌దేవ్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌గా మార్చుకున్నాడని తెలిపారు. అంతేకాకుండా వర్క్ విషయంలో తనలో ఎంతో స్ఫూర్తి నింపుతుంటారని పేర్కొన్నారు. 

Also Read: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్‌ రెబల్‌ స్టార్‌! 

పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు

అనంతరం ఆమె తన పెళ్లిపై మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి గురించి తానెప్పుడూ ఆలోచించలేదన్నారు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే తనకు ఎప్పుడూ కలగలేదని తెలిపారు. అప్పుడప్పుడూ.. పెళ్లి తనకు సెట్ కాదనే భావనలో ఉండేదాన్ని అని చెప్పుకొచ్చారు. 

కానీ కొన్ని సంఘటనలు మన జీవితాన్ని మార్చేస్తాయి అన్నట్లు.. కాలానుగుణంగా నికోలయ్‌తో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపారు. అలా కొద్ది రోజులు అయ్యాక.. అతడే తన జీవితానికి సరైన భాగస్వామి అని అర్థమైందని చెప్పారు. దీంతో ఇరుకుంటుబాల అంగీకారంతో తామిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు