Varalakshmi: రూ.2500లకు ఆ పని చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా: నటి వరలక్ష్మి!

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ డ్యాన్స్‌ షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో తాను ఒక షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. అలా వేసినందుకు తనకు రూ.2500 ఇచ్చారని.. అలాంటి తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.

New Update

నటి వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రవితేజ, బాలకృష్ణ సహా మరెంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి ఫుల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అలాగే లేడీ ఓరియేంటెడ్ సినిమాలు తీస్తూ మరింత పాపులర్ అయింది. శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్ దంపతుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత స్వతహాగా తానంతట తానే పైకెదిగింది. 

ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ

వరుస సినిమాలతో జోరు

తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. తెలుగు, తమిళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ అందుకుంది. ముఖ్యంగా తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుని బిజీ బిజీ కెరియర్‌ను గడిపింది. ఇక కెరియర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఎన్నో ఏళ్లు పీకల్లోతు ప్రేమలో ఉండి.. గతేడాది పెళ్లి పీటలెక్కింది. అక్కడ నుంచి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. 

డబ్బులు కోసం ఆ పని చేశా

ఇదిలా ఉంటే తాజాగా వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. డబ్బుల కోసం తాను ఓ పని చేశానని.. ఆ పని వల్లే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపింది. తాజాగా ఓ డ్యాన్స్ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ షోలో ఓ ముగ్గురు పిల్లల తల్లి అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేసింది. 

Also read: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్

అదే సమయంలో ఆ మహిళ ఏడుస్తూ తాను జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు చెప్పింది. ఆమెను సర్దిచెప్పే ప్రయత్నంలో వరలక్ష్మి తాను ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసిందో చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రాకముందు తాను కూడా ఒక డ్యాన్సర్‌నేనని తెలిపింది.

తాను ఒక ప్రముఖ షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. అలా వేసినందుకు తనకు రూ.2500 ఇచ్చారని.. అలాంటి తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అందువల్ల ఎప్పుడూ రోడ్డు మీద డ్యాన్స్ వేయడం తప్పుగా భావించకూడదు అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment