Samantha : మరోసారి కొండా సురేఖకు సమంత కౌంటర్! ఏమందో తెలిస్తే షాకే నటి సమంత ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో కొండా సురేఖ వివాదం పై మరోసారి స్పందించారు. "ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రేమ, నమ్మకమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని. వారు తన పక్షాన లేకపోతే కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం కష్టమని తెలిపింది." By Archana 17 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update samantha షేర్ చేయండి Samantha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత పై చేసిన కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్ కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ వాక్యాలను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ సైతం ఖండిస్తూ సమంత, అక్కినేని కుటుంబానికి మద్దతుగా నిలిచారు. Also Read: బ్రాను అలా ధరిస్తే క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు! కొండా సురేఖ పై సమంత కామెంట్స్ ఇది ఇలా ఉంటే తాజాగా తన వెబ్ సీరీస్ సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత మరోసారి కొండా సురేఖ వివాదం పై స్పందించారు. రిపోర్టర్ కొండా సురేఖ వివాదం గురించి అడగ్గా సామ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రేమ, తన పై వారికి ఉన్న నమ్మకమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని. వారు తన పక్షాన లేకపోతే కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం చాలా కష్టమని తెలిపింది. తన చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే వాటిని ఎదుర్కోగలిగాను అని అన్నారు. Also Read: 'అఖండ 2 - తాండవం'... మాస్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య.. వీడియో వైరల్ ట్రోలింగ్ పై సామ్ కామెంట్స్ అలాగే సామ్ ఆన్‌లైన్ ట్రోలింగ్ పై కూడా స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించనని. ద్వేషపూరిత సందేశాల ప్రభావం తన పై పడకుండా చూసుకుంటానని తెలిపింది. అలాంటివి పంపిన వారు కూడా అదే బాధను అనుభవించారేమో.. అని ఆలోచిస్తానని చెప్పింది. సినిమాల నుంచి చాలా రోజుల గ్యాప్ తర్వాత సామ్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సిటాడెల్' సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సీరీస్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Also Read: ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి! Also Read: Priyanka Chopra భర్తకు ప్రమాదం..? షో మధ్యలోనే పారిపోయిన నిక్! #telangana #tollywood #konda-surekha #samantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి