GV Prakash-saindhavi: వాళ్లు విడిపోతే.. నన్ను తిట్టారు: జీవీ ప్రకాశ్ విడాకులపై నోరువిప్పిన నటి!

జీవీ ప్రకాశ్-సైంధవి జంట విడిపోవడానికి కారణం నటి దివ్య భారతి అని గతంలో ప్రచారం సాగింది. దీనిపై తాజాగా నటి నోరు విప్పింది. తామిద్దరం మంచి స్నేహితులమని పేర్కొంది. అంతకు మించి తమమధ్య ఏమీలేదని క్లారిటీ ఇచ్చింది. జీవీ కూడా స్పందించి తాము స్నేహితులం అనే అన్నాడు.

New Update
actress Divya Bharathi About Gv Prakash Divorce in King Ston movie interview

actress Divya Bharathi About Gv Prakash Divorce in King Ston movie interview

GV Prakash-Saindhavi: కోలీవుడ్ స్టార్ సింగర్ జీవీ ప్రకాశ్ - సైంధవి జంట గతేడాది విడిపోయారు. పలు కారణాల వల్ల ఒకరినొకరు అర్థం చేసుకుని తమ హ్యాపీ లైఫ్‌కు శుభం కార్డు పలికారు. అయితే ఈ జంట విడిపోవడానికి ఓ నటి కారణమని ఆ మధ్య వార్తలు జోరుగా సాగాయి. ఆ వార్తలపై నటి తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు దివ్య భారతి. వీరిద్దరు కలిసి గతంలో ‘బ్యాచిలర్’ అనే సినిమా చేశారు. 

Also Read: America: పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!

ఆ సినిమా సినీ ప్రేక్షకుల నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా అందులో జీవీ ప్రకాశ్, దివ్య భారతి కెమెస్ట్రీకి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాతే జీవీ ప్రకాశ్ -సైంధవి జంట విడాకులకు సిద్ధమయ్యారు. దీంతో దివ్య భారతి పై పలువురు విమర్శలు చేశారు. తాజాగా ఆమె ఈ వార్తలపై స్పందించింది. 

Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్

ఎంతో మంది విమర్శించారు

తాజాగా జీవీ ప్రకాశ్- దివ్యభారతి మరోసారి కలిసి నటించిన చిత్రం ‘కింగ్‌స్టన్‌’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్య భారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా జీవీ ప్రకాశ్‌ విడాకులను ఉద్దేశించి ఆమె మాట్లాడింది. జీవీ ప్రకాశ్‌ తన భార్య సైంధవి విడాకులు ప్రకటించిన టైంలో తనను ఎంతో మంది విమర్శించారని తెలిపింది. వారిద్దరూ విడిపోవడానికి కారణం తానేనని చాలా మంది తనపై ట్రోలింగ్స్ చేశారని పేర్కొంది. 

Also Read:City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

జీవీ ప్రకాశ్, తాను గతంలో ‘బ్యాచిలర్‌’ కోసం కలిసి వర్క్‌ చేశాం అని.. ఆ సినిమాలో తమ జంట కెమిస్ట్రీకి చాలా మంది ప్రేక్షకులు మెచ్చుకున్నారని పేర్కొంది. అయితే ఆ సినిమాతో తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని చాలా మంది తప్పుగా అనుకున్నారన్నారు.

ఈ క్రమంలోనే జీవీ ప్రకాశ్‌ - సైంధవి విడాకులు ప్రకటించిన టైంలో ఎంతోమంది తనకు మెసేజ్‌లు పంపారని.. వారు విడిపోవడానికి కారణం తనేనని విమర్శించారన్నారు. తనను తిడుతూ మెసేజ్‌లు పెట్టేవారిలో మహిళలే ఎక్కువమంది అని అన్నారు. వాటిని జీవీకి  పంపిస్తే.. ఇలాంటి మెసేజ్‌ల గురించి పట్టించుకోకుండా కెరీర్‌పై ఫోకస్ పెట్టమని అతడు చెప్పాడని తెలిపింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఇదే విషయంపై జీవీ ప్రకాశ్‌ స్పందించాడు. దివ్యతో తాను పలు ప్రాజెక్ట్‌ల కోసం కలిసి పనిచేశానని.. తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్‌లు లేవని .. తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని అన్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

NTR shirt price: చూస్తే సింపుల్.. కొంటే కాస్ట్ లీ.. ఎన్టీఆర్ షర్ట్ ధర తెలిస్తే పిచ్చెక్కిపోతారు

ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో దుబాయ్ వెకేషన్ కు వెళ్లారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ ధరించిన షర్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అది ఎట్రో అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన షర్ట్ అని తెలిసింది. దాని ధర రూ.85 వేల వరకు ఉంటుందని సమాచారం.

New Update
ntr short price

ntr short price

సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. వారు వేసుకున్న షర్ట్ లు, కాలికి తొడిగిన చెప్పులు లేదా షూస్, కళ్లకు పెట్టుకున్న సన్ గ్లాసెస్, చేతికి కట్టుకున్న వాచ్ ఇలా ప్రతీ విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ పెద్ద పెద్ద హీరోలకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. 

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

అలాంటిదే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ షర్ట్ ధర తెలిసి అభిమానులు, నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఏంటి భయ్యా అంత రేటా? అంటూ ఖంగుతింటున్నారు. ఓరి నాయనో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఆ షర్ట్ ధర ఎంతో తెలుసుకుందాం. 

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కు ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. నందమూరి నటసింహం తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూ. ఎన్టీఆర్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అందువల్లనే ఎన్టీఆర్ కు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆస్తులు, అంతస్తులు, బిజినెస్ వంటి విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

షర్ట్ ధర ఎంతంటే?

తాజాగా ఆయన వేసుకున్న షర్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆ షర్ట్ ధర కోసం ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేసేశారు. ఆఖరికి దాని ధర తెలిసి ఖంగుతిన్నారు. ఇటీవల సినిమా షూటింగ్ లకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్.. తన ఫ్యామిలీతో దుబాయ్ వెకేషన్ కు ట్రిప్ వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారగా.. అందులో ఎన్టీఆర్ పువ్వుల డిజైన్ తో ఉన్న బ్లూ కలర్ చొక్కా ట్రెండింగ్ లోకి వచ్చింది. 

అది ఎట్రో అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన షర్ట్ అని తెలిసింది. ఆ షర్ట్ చూడ్డానికి సింపుల్ గానే ఉన్నా.. వెరీ కాస్ట్ లీ అని చెబుతున్నారు నెటిజన్లు. దాదాపు రూ.65 వేల నుంచి రూ.85 వేల వరకు దాని ధర ఉంటుందని సమాచారం. దీంతో ఆ షర్ట్ ధర తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. 

movie-news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment