Mega star B'day special: ఒకే ఒక్క సినిమాకు డైరెక్ట్ చేసిన బాస్.. అదేంటో మీకు తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. పాత జనరేషన్ నుంచి ఇప్పటి వారి వరకు అందరికీ ఆయన సినిమాలు ఇష్టమే. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంతో ఎత్తుకెదిగిన చిరంజీవి ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ వివరాలు ఈ స్టోరీలో చూడండి.

New Update
థియేటర్స్ లో రీ రిలీజ్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

Mega Star Chiranjeevi: ఇప్పుడు అంటే కొంత చరిష్మా తగ్గింది కానీ ఒకప్పుడు మెగాస్టార్ బర్త్‌డే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగలా ఉండేది. కొన్నేళ్ళు పాటూ తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన చిరంజీవి సాధారణ నటుడు స్థాయి నుంచి మెగాస్టార్‌‌గా ఎదిగారు. ఒకానొక సమయంలో బిగ్గర్ దెన్ బచ్చన్ అనే స్థాయికి చిరంజీవి చేరుకున్నారు. ఆయన క్రేజ్‌కు ఇండియన్ సినిమానే తలొంచింది. ఎన్నో మైలు రాళ్లు దాటితే.. ఎన్నో అవమానాలు సహిస్తే.. ఎన్నో ఛాలెంజ్ లను స్వీకరిస్తే.. మరెన్నో రివార్డులు పొందితే.. ఇంకెన్నో రికార్డులు నెలకొల్పితే వచ్చిందీ పేరు. ప్యాషన్ కు స్వయంకృషిని జోడించి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక మనిషి ఎన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అన్న మాటకు నిదర్శనం ఆయన. నలభై యేళ్ల క్రితం.. ముగ్గురు నలుగురిలో ఒకడిగా మొదలై.. మూడు నాలుగు కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకునే వరకూ సాగిన చిరంజీవి ప్రస్థానం అనన్యసామాన్యమైనది.

ఇప్పుడు డాన్స్‌లు ఇరగదీస్తున్న రామ్ చరణ్, అల్లు అర్జున్, జూ.ఎన్టీయార్ వీళ్ళందరి కన్నా ముందు డాన్స్ అంటే చిరంజీవి...చిరంజీవి అంటే డాన్స్ అనేవారు. తాను ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో దూరిపోయి నటించే మెగాస్టార్ ఒక సినిమాకు దర్శకత్వం కూడ వహించారు. అది కూడా తన సినిమాకే. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలుగు సినిమా పుస్తకంలో చిరంజీవి కంటూ కొన్ని పేజీలు ప్రత్యేకంగా ఉంటాయి. అందులో ఆయన నటించిన ఇంద్ర సినిమా గురించి తప్పకుండా ఉంటుంది. అన్ని తరాల వారికి చిరంజీవి మేనియా గురించి తెలిసేలా చేసిన ఇంద్ర. అసలు ఇంద్ర సినిమా నెలకొల్పిన రికార్డుల గురించి ఒక పుస్తకమే రాయోచ్చు.

బీ.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్ర సినిమా అపట్లో పెద్ద హిట్. ఇందులో డైలాగ్‌లు, మాటలు, పాటలు ఒకేంటి.. అన్నీ మెగా హిట్. ఫుల్ ఫ్యాకేజీ సినిమా అయిన ఇంద్రను ఇప్పటికీ టీవీల్లో రిపీటెడ్‌గా చూసేవాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదేమో. ఇలాంటి సినిమాకు బీ.గోపాల్‌తో పాటూ చిరంజీవి కూడా దర్శకత్వం వహించారు. చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కొన్ని సీన్లు మెగాస్టార్ దర్శకత్వం వహించాడు. ప్లాష్ బ్యాక్‌లో హోమం సీన్‌తో పాటు సాంగ్స్ అన్నీ చిరునే డైరెక్ట్ చేశారట. ఈ విషయాన్ని నటుడు రాజా రవీంద్ర ఈ మధ్యనే ఓ సందర్భంలో చెప్పాడు. అప్పట్లోనే ఈ సినిమా కోసం అశ్వనీదత్ 10 కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా విడుదల అయ్యాక ఫైనల్ రన్‌లో ఏకంగా రూ.55 కోట్లు కొల్లగొట్టి… రూ.50 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు.

Also Read: Movies: మన అనుకుంటే వస్తా..నచ్చితే వస్తా..అల్లు అర్జున్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aamir Khan Mahabharata డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' అమీర్ భారీ ప్లానింగ్.. రూ.. 1000 కోట్లతో..!

అమీర్ ఖాన్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మహాభారతాన్ని' వెండితెరపై చూపించాలనేది తన కల అని చెప్పారు. ఈ సంవత్సరం దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

New Update
Aamir Khan

Aamir Khan

Aamir Khan:  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం  'సితార్ జమీన్ పర్' సినిమాతో బిజీగా ఉన్నారు. తరచూ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కొత్త అప్డేట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చాలాకాలంగా అమీర్ ఖాన్ అతిగొప్ప ఇతిహాసమైన  'మహాభారతాన్ని' వెండితెర పై చూపించాలని ప్రయత్నిస్తున్నారు. 

'మహాభారతం' నా కల 

ఈ ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ..  నేటి తరానికి మహాభరతాన్ని అందించాలనేది తన కల అని  చెప్పారు . ఈ ఏడాది దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీని స్క్రిప్టింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుందని..  ఒకే సినిమాలో స్టోరీ అంతా చూపించలేమని అన్నారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' తరహాలో  సీరీస్ లుగా అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  ఎంతోమంది డైరెక్టర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నారు. స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు సరిపోయే నటీనటుల ఎంపిక చేస్తాము.  అమీర్ ఈ చిత్రంలో నటిస్తాడా లేదా? అని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. 

1000 కోట్ల..

అమీర్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం 2018లో రాకేష్ శర్మ బయోపిక్ నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అమీర్ ఖాన్ దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో  'మహాభారతాన్ని' రూపొందించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

ఇదిలా ఉంటే.. 2022లో 'లాల్ సింగ్ చద్దా' ఊహించని పరాజయంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్న అమీర్.. ప్రస్తుతం ' సీతారే జమీన్ పర్' చేస్తున్నారు. 2007 లో వచ్చిన సూపర్ హిట్ తారే జమీన్ పర్ సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. 

latest-news | cinema-news | Aamir Khan Mahabharat

Also Read: Singer Sunitha: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో.. అసలు నిజం ఇదే!

Advertisment
Advertisment
Advertisment