Chiranjeevi Fans: చిరు అభిమానులు వర్సెస్ కొడాలి నాని అభిమానులు!

చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

New Update
Chiranjeevi Fans: చిరు అభిమానులు వర్సెస్ కొడాలి నాని అభిమానులు!

Chiranjeevi Fans Protest against Kodali Nani : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులు ఆందోళనలకు దిగారు. చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సహా పలువురు వైసీపీ నేతలు మండిపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరంజీవి అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిరుకి కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలకు అడ్డంగా చిరంజీవి అభిమానులు పడుకుని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన కొడాలి నానీకి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గుడివాడలో సామాజిక సమీకరణాల రీత్యా.. చిరంజీవిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిరంజీవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అంత మాత్రానికే ఇష్టానుసారంగా మాట్లాడతారా అని ప్రశ్నిస్తున్నారు.

విజయవాడలోనూ పెద్ద ఎత్తున వచ్చిన చిరు అభిమానులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. డౌన్ డౌన్ కొడాలి నాని… జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్న చిరంజీవి అభిమానులను విజయవాడ వన్ వే రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రోక్తులైన అభిమానులు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఏజీకే స్కూల్‌ సెంటర్లో విజయవాడ మెయిన్‌రోడ్డుపై చిరంజీవి అభిమానులు బైఠాయించారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు చేశారు.

అనంతపురం నగరంలోనూ చిరంజీవి అభిమానుల నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. టవర్ క్లాక్ వద్ద ఫ్యాన్స్ నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్రం, ప్రజల భవిష్యత్ గురించి చిరంజీవి మంచి మాటలు చెబితే, ఆయనపై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చిరు ఫ్యాన్స్ హెచ్చరించారు.

వాల్తేరు వీరయ్య 200రోజుల ఫంక్షన్ లో.. చిరంజీవి మాట్లాడుతూ సినిమా రంగంపై రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై స్పందించారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి అంటూ కొంచెం ఘాటుగానే చిరు స్పందించారు.

దీని గురించి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చిరు వ్యాఖ్యల పై మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ అయితే సినీ పరిశ్రమని పిచ్చుకతో పోల్చిన చిరంజీవినే దానిని తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు. ఈ క్రమంలోనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఘాటుగానే స్పందించారు.

‘సినిమా పరిశ్రమలోని పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ’ ఆయన వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లు పకోడీగాళ్లు.. ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. తనవాళ్లకు కూడా ఈ సలహాలు ఇస్తే బావుంటుందన్నారు. మనకెందుకురా బాబు మన డ్యాన్సులు, ఫైట్లు మనం చూసుకుందామని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిదన్నారు కొడాలి నాని.

Also Read: మరో వివాదంలో రాహుల్ గాంధీ. స్త్రీ ద్వేషం గల వారే ఇలా చేస్తారన్న స్మృతి ఇరానీ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు